టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది యాంకర్ కమ్ నటి అనసూయ వ్యవహారం. అర్జున్ రెడ్డి మూవీ విడుదల వేళలో.. విజయ్ దేవరకొండ నోటి నుంచి వచ్చిన ఒక డైలాగ్ మీద అభ్యంతరం వ్యక్తం చేయటం.. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్పటంపై రౌడీ ఫ్యాన్స్ చెలరేగిపోవటం తెలిసిందే. నువ్వు చేసే షోల మాటేమిటంటూ.. తమకున్న తెలివిని ప్రదర్శిస్తున్నారే తప్పించి.. తమ వాడి తప్పును ఒప్పుకోవటానికి మాత్రం ఇష్టపడటం లేదు.
తాము అభిమానించే వారిపై ఈగ వాలకుండా చేయటం.. పిడి వాదనను వినిపించటం ఇటీవల కాలంలో ఒక అలవాటుగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ తాజా మూవీ లైగర్ విడుదలైన వేళ.. ఫలితం ప్రతికూలంగా వచ్చిన వేళ.. దేవుడు ఉన్నాడంటూ ఆమె పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఫలానా అన్న పేరును ప్రస్తావించకుండా.. అమ్మను అన్నందుకు ఉసురు తగిలిందంటూ అనసూయ పోస్టు సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది.
తమ అభిమాన హీరో మూవీ ఫలితం ప్రతికూలంగా మారి.. ఇప్పటికే బాధలో ఉన్న రౌడీ ఫ్యాన్స్ కు.. అనసూయ పోస్ట్ పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఎప్పుడేం అనాలో తెలీదా? అంటూ మండిపడుతూ.. చెలరేగిపోతూ ఆమెను ఇష్టారాజ్యంగా తిట్టేస్తున్నారు. నిజానికి అనసూయ చేసింది తప్పా? ఒప్పా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ.. ఒకప్పుడు తనను ఉద్దేశించి దారుణంగా తిట్టిపోసిన వేళ.. అభిమానుల్ని కాస్తంత కంట్రోల్ గా ఉండమని మాట వరసకు చెప్పని విజయ్ దేవరకొండ తీరుకు ఆమె హర్ట్ అయి ఉండొచ్చు.
మిగిలిన చాలామంది సెలబ్రిటీలతో పోలిస్తే అనసూయ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. స్క్రీన్ మీద కనిపించే అనసూయకు..విషయాల మీద వ్యక్తిగతంగా ఆమె స్పందించే తీరుకు చాలానే తేడా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అందుకుతగ్గట్లే తాజా పోస్టు అని కూడా చెప్పాలి. ఆమె పోస్టుకు చెలరేగిపోయిన రౌడీ ఫ్యాన్స్.. ఆమెను రాయలేని భాషతో అతి దారుణంగా బూతులు తిట్టేయటంతో పాటు.. ప్రతి మాటకు ముందు.. వెనుకా 'ఆంటీ' అంటూ ఆమెను అనేస్తున్న సంగతి తెలిసిందే.
తనను అదే పనిగా ఆంటీ.. ఆంటీ అనడాన్ని ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్న అనసూయ.. ఇలా అనే వారిపై కేసులు పెట్టేస్తానని.. ఈ ఆన్ లైన్ అబ్యూజ్ ఏంటి? అంటూ కొత్త ప్రశ్నను సంధిస్తున్నారు. ఆన్ లైన్ అబ్యూజ్ అన్న దాన్ని పక్కన పెడితే.. అనసూయ చెప్పినట్లు.. ఆంటీ అన్నంతనే నేరం అవుతుందా? అలా అన్న వారి మీద కేసులు పెట్టేయొచ్చా? వారికి శిక్షలు పడతాయా? అన్న ప్రశ్నలకు చట్టం మీద అవగాహన ఉన్న నిపుణులు ఏమంటున్నారన్నది ఆసక్తికరం.
అనసూయ పుణ్యమా అని ట్రెండింగ్ గా మారిన 'ఆంటీ' మాటపై అభ్యంతరం వ్యక్తం చేయటంలో అర్థం లేదనే మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. 'ఆంటీ' అంటే అత్త.. పిన్ని.. లాంటి మంచి అర్థాలే ఉన్నప్పటికీ.. దాన్ని ఏ ఉద్దేశంతో అంటున్నారన్నది తెలిసిందే. అందుకే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న అనసూయ.. చట్టపరమైన చర్యలకు సై అంటున్నారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఎదుటి వారి మనోభావాల్ని.. సెంటిమెంట్లను కించపర్చటం.. అవమానించటం.. దూషించటం లాంటివి తప్పే అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇలాంటి పోస్టుల కారణంగా చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. అయితే.. ఆంటీ అన్న పదం మాత్రమే వాడితే మాత్రం అదే మాత్రం నేరంగా పరిగణలోకి తీసుకోరంటున్నారు.
న్యాయ నిపుణుల మాటల్ని చూస్తే.. 'ఆంటీ' అని పిలవటం.. పోస్టులు పెట్టటం నేరం ఎంత మాత్రం కాదు. ఆంటీ అంటూ టీజ్ చేయటం.. బాధితురాలి మనోవేదనకు గురయ్యేలా పదే పదే ఇబ్బంది పెట్టటం.. ఆమెను ఆందోళనకు గురి చేయటం మాత్రం తప్పే అవుతుంది. ఇలాంటి వాటిపై మాత్రం చర్యలు తీసుకునే వీలుంది. కానీ.. కోర్టులో ఈ తరహా కేసులు ఎంతమేర నిలుస్తాయన్నది మాత్రం క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆంటీ అన్నది మంచి పదమే.
ఆంటీ అని పిలవటం అవమానకరంగా భావించే అవకాశం ఉన్నప్పటికీ భారతీయ న్యాయ వ్యవస్థలో మాత్రం దీన్నో నేరంగా మాత్రం పరిగణించే వీల్లేదంటున్నారు. ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం శిక్షార్హమైన పరువు నష్టానికి అత్యంత సమీపమైనది ఉన్నప్పటికీ మినాహాయింపులోకి వెళుతుంది. అలా అని.. దీన్ని పరువు నష్టంగా క్లెయిమ్ చేయటం కుదరదంటున్నారు.
ఆంటీ అని పిలిచి.. ఎమోషన్ ను దెబ్బ తీశారన్న ఆరోపణతో కేసు వేయడం సాధ్యం కాదంటున్నారు. ఇలాంటి కేసులు వేసిన వారికి తీర్పులు అనుకూలంగా రావటం అటు ఉంచి.. రివర్సులో కోర్టులు పిటిషన్లు దాఖలు చేసిన వారి మీదనే ఎదురు దెబ్బ తగిలి.. విలువైనకోర్టు సమయాన్ని వేస్టు చేసినందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. వేలాది కేసులు పెండింగ్ లో ఉన్న వేళలో.. 'ఆంటీ' తో టీజ్ చేస్తున్నారన్న వాదనకు కోర్టులు సానుకూలంగా స్పందించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ విషయాలన్నీ అనసూయ తెలుసుకుంటున్నారా? అన్నది అసలు ప్రశ్న.