ఫొటోటాక్‌ః ఇంకా వదల్లేదా తల్లి..!

Update: 2020-12-16 08:00 GMT
హీరోయిన్‌ కీర్తి సురేష్‌ వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ ప్లాప్‌ లతో సంబంధం లేదు అన్నట్లుగా ముందుకు దూసుకు పోతుంది. ఈమె నటించిన పెంగ్విన్‌.. మిస్‌ ఇండియా సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలు రెండు కూడా నిరాశ పర్చాయి. ముఖ్యంగా మిస్ ఇండియా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. ఇలాంటి సినిమాలను కీర్తి సురేష్‌ ఎలా ఒప్పుకుంది అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో కీర్తి సురేష్‌ చేయవద్దని అభిమానులు అంటున్నారు. ఆ సినిమాలను కూడా ఎప్పుడు ప్రస్థావించొద్దు అంటున్నారు.

అభిమానులు ఆ సినిమాల గురించి మెల్లగా మర్చిపోతున్న సమయంలో కీర్తి సురేష్‌ తాజాగా ఇంటర్నేషనల్‌ టీ దినోత్సవం సందర్బంగా మిస్‌ ఇండియాలోని ఒక స్టిల్‌ ను ట్వీట్‌ చేసింది. ఆ సినిమాలో కీర్తి సురేష్‌ టీ వ్యాపారం చేస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేయడంతో చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా గురించి మళ్లీ ప్రచారం అవసరమా అన్నట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇంకా వదల్లేదా తల్లి అంటూ ఫన్నీగా ఈ ఫొటోకు రీ ట్వీట్‌ చేశాడు. ఏదో సందర్బం వచ్చింది కదా అని కీర్తి సురేష్‌ ఈ ఫొటోను షేర్‌ చేస్తే నెటిజన్స్‌ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.
Tags:    

Similar News