నితిన్ కి కొంతకాలంగా హిట్టు పట్టుబడటం లేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే కసితో ఆయన 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేశాడు. పొలిటికల్ టచ్ తో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సుధాకర్ రెడ్డి - నికితా రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు.
మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నితిన్ సరసన నాయికలుగా కృతి శెట్టి .. కేథరిన్ అలరించనున్నారు. ఈ సినిమాలో అంజలి ఐటమ్ సాంగ్ చేసింది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను 'గుంటూరు'లో నిర్వహించారు. దర్శకుడు అనిల్ రావిపూడి చీఫ్ గెస్టుగా ఈ వేడుక జరిగింది. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " వైజాగ్ లో బాలకృష్ణగారి 108వ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను.
'మాచర్ల నియోజక వర్గం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రమ్మని నితిన్ కాల్ చేశారు. 'ఎక్కడా?' అని అడిగితే 'గుంటూరు' అని చెప్పారు. గుంటూరుతో మనకి కొంచెం టచ్ ఉందమ్మా. ఈ పక్క జిల్లాలో పుట్టి పెరిగాను. ఇంటర్మీడియెట్ .. ఇంజనీరింగ్ ఇక్కడే చేశాను.
మీ అందరిలాగే నేను ఇక్కడి సినిమా ఫంక్షన్స్ కి వచ్చి చూసినవాడినే. ఈ రోజున ఇంత పెద్ద సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రావడం చాలా హ్యాపీ గా ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను గుంటూరులోని థియేటర్స్ లోనే చూశాను. ఇక్కడి విచిత్రమేమిటంటే ఒక్కో స్టార్ సినిమాలు ఒక్కో థియేటర్ కి వస్తుంటాయి. ఆ థియేటర్స్ లో వేసిన ఈలలు .. గోలలు ఇప్పటికీ నాకు వినిపిస్తున్నాయి. అలాంటి గుంటూరు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.
ట్రైలర్ ను గురించి చెప్పాలంటే .. ఈ మధ్య కాలంలో వచ్చిన పిచ్చ మాస్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. నితిన్ గారిని ఇంత హై ఓల్టేజ్ తో నేను ఎప్పుడూ చూడలేదు. ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనిపిస్తోంది. ఈ సినిమాకోసం అంతా ఎంతగా కష్టపడ్డారనేది అర్థమవుతూనే ఉంది. ఆర్టిస్టులకు .. టెక్నీషియన్లకు బెస్ట్ విషెస్ చెబుతున్నాను. 20 ఏళ్ల జర్నీలో నితిన్ పీక్ లోకి వెళ్లాడు .. అంతే డౌన్ చూశాడు .. మళ్లీ టాప్ లోకి వెళ్లాడు. ఈ సినిమాతో సక్సెస్ ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించాడు.