షారూక్ ఖాన్.. జూహీ చావ్లా స్నేహం గురించి ప్రపంచానికి తెలిసిందే. ఈ ఇద్దరూ హిట్ పెయిర్ గా ఎన్నో క్లాసిక్స్ లో నటించారు. అభిమానుల్ని సంపాదించుకున్నారు. కెరీర్ ఎండ్ లో జూహీ చావ్లా బాద్ షాతో కలిసి సినిమాలు నిర్మించింది. ఇప్పటికే ఈ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవలి కాలంలో జూహీ చేసిన ఓ కామెంట్ బాలీవుడ్ లో పెనుకంపనం పుట్టించింది. షారూక్ ఖాన్ నటించిన దిల్ వాలే చూడాలనుకోవడం లేదు. ఆ సినిమాలో అంత ఏం ఉంది? అన్నట్టే మాట్లాడింది. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ మీడియా కథనాలు అల్లేసింది. షారూక్ కి వ్యతిరేకంగా మాట్లాడిన జూహీ అంటూ నానా రాద్ధాంతం చేసింది మీడియా. ఈ దెబ్బకి హడలిపోయిన జూహీ అందుకు సమాధానం చెప్పుకోవాల్సొచ్చింది.
ఓరి దేవుడో.. ఆ ఇష్యూ ఇంత పెద్దది అయిపోతుందని అనుకోలేదు. ఏదో క్యాజువల్ గానే అనేశా. ఎన్నో సినిమాలు స్కిప్ కొడుతుంటాం. అందులో ఇదొకటి. అంతే తప్ప ఈ మ్యాటర్ ని ఇంత సీరియస్ చేస్తారనుకోలేదు. నా ఫేవరెట్ తీసిన సినిమానే స్కిప్ కొట్టాను. సమయాభావం వల్ల కూడా అప్పుడప్పుడు చూడలేం. అంత మాత్రాన ఇంత రాద్ధాంతం చేయాలా? అంటూ ప్రశ్నించింది. అంతేనా .. ఇలాంటివాటికి ఏడ్వాల్సిన పనేలేదని చెప్పింది.