రాణి డాన్స్ ఎలా చేసిందబ్బా?

Update: 2019-02-16 08:24 GMT
దర్శకుడు క్రిష్ హీరొయిన్ కంగనా రౌనత్ మధ్య రగిలిన మణికర్ణిక చిచ్చు మొత్తానికి దాని బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ లాగే చల్లారిపోయింది. మొదటి మూడు నాలుగు రోజులు ఓ మాదిరి వసూళ్ళతో పర్వాలేదు అనిపించినా తర్వాత మాత్రం స్లో అయిపోయి వంద కోట్ల మార్కు అందుకోలేక చతికిలబడింది. ట్విట్టర్ వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకున్నాక ఫైనల్ గా క్రిష్ ఒకవేళ కంగనా మొత్తం తనే దర్శకత్వం వహించాను అనే ఫీలింగ్ లో ఉంటే ఏమి అభ్యంతరం లేదని నిజాలు ప్రేక్షకులకు తెలుసనీ ముక్తాయింపు ఇచ్చేసాడు.

అయితే ఇప్పుడు సినిమాలోని ఓ పాట డాన్స్ కు సంబంధించి కొత్తగా ఒక ఆసక్తికరమైన పాయింట్ బయటికి వచ్చింది. మణికర్ణికలో ఓ సుదీర్ఘమైన డాన్స్ సీక్వెన్స్ ఒకటుంది. అది వచ్చే సందర్భంలో కంగనా వేసిన ఝాన్సీ రాణి పాత్ర గర్భంతో ఉంటుంది. ఆ సమయంతో భర్త ఎదురుగా ఉండగానే అలా అంతేసి పెద్ద పెద్ద స్టెప్పులు వేస్తూ నృత్యాలు చేయడం అసంబద్దంగా ఉంటుందని క్రిష్ చెప్పాడట. అయినా కంగనా ఒప్పుకోకుండా తన డాన్స్ టాలెంట్ చూపించుకోవడానికి ఆ సీక్వెన్స్ పెట్టేసింది.ఆ యూనిట్ లో పనిచేసిన ఓ సభ్యుడి నుంచి వచ్చిన సమాచారంగా దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఝాన్సీ రాణి కడుపులో బిడ్డతో అలా పబ్లిక్ గా డాన్స్ చేయడం ఎబ్బెట్టుగా ఉంటుందని బేసిక్ లాజిక్ ని మర్చిపోయి ఇది పెట్టడం తేడా కొట్టిందని సదరు వ్యక్తి వెర్షన్.

గతంలో పద్మవత్ లో ఇలాంటి సందర్భమే వచ్చినప్పుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దీపికా పదుకునే నడుము కనిపించకుండా జాగ్రత్త పడి కథానుసారం కేవలం రాణి చెలికత్తెలు మాత్రమే ఉండేలా షూట్ చేసారు. అలాంటి కనీస జాగ్రత్త వహించకపోవడం వల్లే మణికర్ణిక కంగనా టాలెంట్ షో కేసు లా మారింది తప్ప దర్శకుడు క్రిష్ చెప్పాలనుకున్న చరిత్ర పక్కకు వెళ్లిందని అన్నారట. ఏదైతేనేం గతం గతః రీతితో ఇవి ఇప్పుడు మణికర్ణికను కాపాడలేవు కాని కనీసం ఇకనైనా ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకునే అవసరం తెలుస్తుంది
Tags:    

Similar News