వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా వివాదమే. ఆయన ఇటీవల కొండా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొండా వర్గీయులను ఉద్దేశించి.. ఆయన ప్రత్యర్థులను ఉద్దేశించి ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడో అంటూ అంతా ఎదురు చూశారు. కాని కొండా విడుదల సమయంలో అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏమీ చేయలేదు.
వర్మ కొండా ను మరీ వివాదం చేయకుండానే విడుదల చేయడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో ఆయన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి అయిన ద్రౌపది ముర్ము గురించి ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ ఉద్దేశ్యం ఏంటీ అనేది క్లారిటీ లేదు.. కాని ఆయన ట్వీట్ ను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ వివాదాన్ని రాజేస్తూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చే వరకు వెళ్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ద్రౌపది ముర్ము ను అవమాన పరిచే విధంగా ఉందంటూ తెలంగాణ బీజేపీ లీడర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తాను చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతుందని గ్రహించిన వర్మ వెంటనే ఆమె ను ఉద్దేశించి మళ్లీ పాజిటివ్ గా ట్వీట్ చేయడం జరిగింది. అయినా కూడా వర్మ పైగా పోలీసు కేసులు ఆగడం లేదు.
తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని లక్నో పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈమె ద్రౌపది అయితే పాండవులు ఎవరు.. ముఖ్యంగా కౌరవులు ఎవరు అన్నట్లుగా వర్మ ట్వీట్ చేశాడు.
ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ను ఫిర్యాదు కాపీతో జత చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఎంక్వౌరీ మొదలు పెట్టినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత ట్వీట్ లో ద్రౌపది ముర్ము గారి నవ్వు గొప్పగా ఉంది.. ఆమె గొప్ప వ్యక్తి కాబోతున్నారు అన్నట్లుగా వర్మ మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. వర్మ తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేయడంతో పాటు.. ద్రౌపది ముర్ము పై తనకు గౌరవం ఉంది అన్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. అయినా కూడా వివాదం ఆయనను వీడటం లేదు. ఎఫ్‌ఐఆర్ నమోదు అవ్వడంతో వర్మ విచారణకు హాజరు కాక తప్పదు అంటున్నారు.