గూగుల్ భాషలో చెప్పుకుంటే పోర్న్ స్టార్ కం బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ కి.. భారత ప్రధాని మోడీ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈమె గత చరిత్రను వదిలేసి.. ఓ హీరోయిన్ గా ఇండియన్స్ అందరూ అంగీకరించేశారు. అంతే కాదు.. లావిష్ వెడ్డింగ్స్ కు ఈమెతో ప్రదర్శనలు ఇప్పించేందుకు కూడా వెనుకాడ్డం లేదు. రీసెంట్ గా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై నడిచిన తొలి బాలీవుడ్ బ్యూటీగా రికార్డు కూడా సృష్టించేసింది.
ఇంత సాధించినా సొంతూరిలో మాత్రం ఈమెను దాదాపు వెలివేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ లోని సార్నియాలో సన్నీ లియోన్ జన్మించింది. సాంప్రదాయ సిక్కుల ఫ్యామిలో జన్మించిన ఈమె వయసు 35 సంవత్సరాలు కాగా.. అసలు పేర కెరెన్ జిత్ కౌర్ వోహ్రా. క్రమంగా పోర్న్ సినిమాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని.. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ గా ఎదిగిన ఈమెపై.. ఫిలిం మేకర్ దిలీప్ మెహతా ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. మోస్ట్లీ సన్నీ పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ.. టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కూడా ప్రదర్శించారు.
అయితే.. సన్నీ గురించి మాట్లాడేందుకు ఆమె సొంతూరు సార్నియాలో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాకపోవండ ఆశ్చర్యం కలిగించింది. అసలు ఆమె పేరెత్తేందుకు కూడా కెనడియన్ ఇండియన్స్ ఇష్టపడ్డం లేదంటే.. ఇక్కడ ఆమెను ఎంతగా వ్యతిరేకిస్తున్నారనే కాదు.. వెలివేసేశారనే విషయం అర్ధమవుతుంది. రచ్చ గెలిచినా.. సన్నీ ఇంట మాత్రం గెలవలేకపోయిందన్న మాట.