శాతకర్ణికి హైకోర్టు షాక్!!

Update: 2017-02-01 04:25 GMT
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శాతకర్ణి.. ఓవర్సీస్ లో 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి రోజునుంచే వచ్చిన పాజిటివ్ టాక్.. రివ్యూలు.. సంక్రాంతి సీజన్ మూవీ కలెక్షన్స్ పెరగడానికి బాగా హెల్ప్ అయ్యాయి.

అయితే.. వసూళ్లు ఈ స్థాయిలో భారీగా ఉండడానికి కారణం పన్ను మినహాయింపును తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించడం కూడా. ఇప్పుడు అదే అంశంపై కోర్టునుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏపీ ప్రభుత్వం గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వడంపై పిల్ దాఖలు కాగా.. ఈ మినహాయింపును అందించడంలో విధానాలు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. శాతకర్ణికి పన్ను మినహాయింపు అందించడంలో.. ఏకపక్షంగా వ్యవహరించారని కోర్టు పేర్కొంది.

దీంతో గతంలో ఇచ్చిన జీఓ నం.14 ను ఉపసంహరించుకుంటామని.. ఈ విషయంలో కొత్త జీఓను రెండు రోజుల్లో జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్.. హైకోర్టుకు విన్నవించాడు.  ఇవాళ మరోసారి హైకోర్టులో ఇదే అంశంపై వాదనలు జరగనున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News