మెగాస్టార్ చిరంజీవి నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్లవుతోంది. దీంతో ఆయన నటించిన 'ఆచార్య' చిత్రం కోసం ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019 అక్టోబర్ లో మొదలైన ఈ చిత్రం ఆ తరువాత కోవిడ్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత 2020 నవంబర్ లో పట్టాలెక్కిన ఈ మూవీ ఆ తరువాత రామ్ చరణ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి కాజల్, చరణ్ ఎంట్రీ, ఆ తరువాత పూజా హెగ్డే సెట్స్ లోకి రావడంతో మొత్తానికి పూర్తయిపోయింది.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మొత్తానికి అనేక అవాంతరాల తరువాత ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలని ప్రారంభించారు. ఇటీవలే ట్రైలర్ తో ఊపు తీసుకొచ్చిన కొరటాల శివ తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేయబోతున్నారు.
ఈ పాట ప్రత్యేకత ఏంటంటే చిరు, చరణ్ కలిసి 'భలే భలే బంజారా..' అంటూ సాగే పాటలో నటించారు. ఈ పాటకు తమదైన స్టెప్పులతో ఇరగ్గొట్టేశారట. మణిశర్మ సంగీతం అందించిన ఈ లిరికల్ వీడియోని ఏప్రిల్ 18న విడుదల చేస్తున్నామని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిరు, చరణ్ లకు సంబంధించిన ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. దీంతో పాటు చిరు, చరణ్ లకు సంబంధించిన ఆసక్తికరమైన సంభాషణకు సంబంధించిన వీడియోని కూడా అభిమానులతో పంచుకుంది.
ఎన్టీఆర్, చరణ్ నాటు నాటు పాటకు స్టెప్పుటు ఇరగ్గొట్టేశారని, ఆ పాటలో చరణ్ ని చూశాక తనతో కాలు కదపాలంటే టెన్ష్ మొదలైందన్నట్టుగా చిరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, మేము ఎంత ఇరగ్గొట్టినా.. ఎంత నాటుగా చేసినా...నాన్న తన గ్రేస్ తో ఎక్స్‌ప్రెషన్ తో మమ్మల్ని పక్కన పెడతాడని మా డౌట్ అని చరణ్ తన భయాన్ని వ్యక్తం చేశాడు. అక్కడే వున్న దర్శకుడు కొరటాల శివ చిరు - చరణ్ ల పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఆసక్తికరమైన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ఎవరైనా సినిమా టికెట్ ల కోసం జనాలు గోల గోల చేయడం చూశాను కానీ నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ పాటని షూట్ చేస్తుంటే లైవ్ లో చూడాలని చాలా మంది ఫోన్ లు చేసి సెట్ కు వస్తామని అడిగారు.
సినిమా టికెట్ ల కోసం ఎలా ఫోన్ లు చేస్తారో అంతకు మించి మీ పాటని షూట్ చేస్తుంటే లైవ్ లో చూడాలని వుందని చాలా మంది ఫోన్ లు చేయడం మర్చిపోలేను'అని అసలు విషం చెప్పారు. ఇక వీడియో చివర్లో చిరు ..' చరణ్ సాంగ్ లో నన్ను డామినేట్ చేద్దామని చూస్తున్నావా..? అంటే లేదు డాడీ అని చరణ్ అనడం.. వెంటనే చిరు నవ్వేసి 'నీ బాబునిరా నేను 'నటానే.. డామినేట్ చేయను డాడ్ కానీ తగ్గను అనేశాడు చరణ్. అది సరిగ్గా వినని చిరు తగ్గాలి..తగ్గుతావ్ యస్ అని అన్నాడు.
ఆ మాటలకు వెంటనే'తగ్గాలి కాదు డాడీ తగ్గను అని చెప్పాను అన్నాడు. ఇక్కడెందుకు కబుర్లు కెమెరా ముందు సెట్స్ లో చూసుకుందాం' అంటూ చరణ్ ని ఆటపట్టించారు చిరు. ఇలా సరదాగా సాగిన తండ్రి కొడుకుల సంభాషణ ఇప్పడు నెట్టింట సందడి చేస్తోంది.