నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని కెయస్ రవికుమార్ తో చేసేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సీ. కళ్యాణ్ నిర్మిస్తారని.. 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కకమునుపే ఆగిపోయిందని ఫిలిం నగర్ టాక్.
ఈ సినిమా ఆగిపోవడానికి పరోక్షంగా టీడీపీ పరాజయం.. వైసీపీ ఘన విజయమే కారణమని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రలు వైయస్ రాజారెడ్డి.. వైయస్ జగన్మోహన్ రెడ్డిని పోలి ఉన్నాయని.. ఈ రెండు పాత్రలను డబల్ రోల్ గా పోషించేందుకు జగపతి బాబును ఎంపిక చేసుకున్నారని సమాచారం. అయితే ఎలెక్షన్స్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయం సాధించడంతో మేకర్స్ ఇప్పుడు స్క్రిప్ట్ ను మార్చాలని డిసైడ్ అయ్యారట. దీనికి ఎక్కువ సమయం పట్టేలా ఉండడంతో ప్రస్తుతానికి ఈ సినిమా ఆగినట్టేనని సమాచారం.
అయితే టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతున్న ఈ ప్రచారానికి ధృవీకరించేవారు ఎవరూ లేరు. మరి ఈ విషయంపై దర్శకుడు కెయస్ రవికుమార్ లేదా నిర్మాత సీ కళ్యాణ్ స్పందిస్తే కానీ మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ సినిమా కాకుండా బాలయ్య కోసం బోయపాటి శ్రీను కూడా ఒక స్క్రిప్ట్ తయారు చేసిన సంగతి తెలిసిందే. మరి కెయస్ రవికుమార్ సినిమా ఆలస్యం అవుతుంది కాబట్టి బోయపాటికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో వేచి చూడాలి.