మహేష్ సుక్కుల స్టొరీలో మరో ట్విస్ట్

Update: 2019-03-10 04:09 GMT
మహర్షి తర్వాత చేయబోయే సినిమా విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో సుకుమార్ తో సినిమా చేయబోవడం లేదని మహేష్ బాబు సోషల్ మీడియాలో పబ్లిక్ గా అనౌన్స్ చేయడంతో అక్కడితో ఆ కథ ముగిసిందనే అనుకున్నరందరూ. అయితే నిన్న మరో కీలకమైన ట్విస్ట్ జరిగినట్టు ఇన్ సైడ్ టాక్. శనివారం సాయంత్రం సుకుమార్ ప్రత్యేకంగా మహేష్ ని కలిసినట్టు వినికిడి. ఈ మొత్తం వ్యవహారంలో సుకుమార్-అల్లు అర్జున్-మహేష్ బాబుల మధ్య ట్రయాంగిల్
ఇష్యూ లో కామన్ గా నిలిచిన మైత్రి సంస్థ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ప్రత్యేకంగా యుఎస్ నుంచి ఈ రాయబారం కోసమే హైదరాబాద్ వచ్చినట్టు టాక్.

మహేష్ ని రిక్వెస్ట్ చేసి ఓసారి సుకుమార్ తో మాట్లాడమని కోరి ఆ మేరకు అంగీకారం తీసుకుని ఈ మీటింగ్ జరిగేలా ప్లాన్ చేశాడట. ఈ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏదైనా కంక్లూజన్ కు వచ్చారో లేదో అనేది మాత్రం ప్రస్తుతానికి టాప్ సీక్రెట్. కాని ఒక్క విషయం స్పష్టం. మహేష్ సుకుమార్ లలో ఎవరూ రాజీ పడినా ఇప్పటికిప్పుడు సినిమా ఉండటం అంత ఈజీ కాదు.

మహేష్ చాలా ఓపెన్ గా సుకుమార్ తో ఇప్పట్లో సినిమా లేదు అని స్పష్టంగా ట్వీట్ చేశాడు. ఇప్పుడు కనక  అలాంటిది ఏమి లేదు సుక్కుతో ప్రాజెక్ట్ ఉంటుంది అని చెబితే అభిమానుల మధ్య అనుమానాలతో పాటు సోషల్ మీడియాలో అనవసరమైన చర్చకు దారిచ్చినట్టు అవుతుంది.

ఈ కారణం వల్ల మహేష్ కన్విన్స్ అయినప్పటికీ సుక్కుకు వెంటనే హామీ ఇవ్వలేకపోవచ్చు. మరోపక్క అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ సీరియస్ గా జరుగుతోంది కాబట్టి ఆ యాంగిల్ లో ఆలోచించినా ఛాన్స్ తక్కువే. తమ మొదటి సినిమా హీరో కాబట్టి మహేష్ విషయంలో ఇలా జరగడం పట్ల మైత్రి తెగ సతమతమైపోతోంది. నిజంగా మహేష్ సుక్కుల మధ్య ఫ్రెష్ మీటింగ్ జరిగి ఉంటే ఇంకొద్ది రోజుల్లో విషయం ఏంటనేది బయటికి రావొచ్చు. చూద్దాం
Tags:    

Similar News