రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న అశ్లీల వీడియోల కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. అశ్లీల చిత్రాల ప్రసారానికి ఏర్పాట్లు చేసిన హాట్ షాట్స్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడంతో రాజ్ కుంద్రా ప్లాన్ బి అమలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'బాలీఫేమ్' పేరుతో మరో యాప్ ను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగించారని పోలీసులు తెలిపారు.
ఇందుకుగాను రాజ్ కుంద్రా ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకూర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలింమ్స్ ను ప్రసారం చేసేందుకు యాప్ ను ఏర్పాటు చేద్దామని యష్ ఠాకూర్.. సదురు ఐబీ అధికారి వద్ద ప్రతిపాదించారు. అందుకు అంగీకరించిన ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్ ను రిజిస్ట్రర్ చేయించినట్టు సమాచారం. ఈ యాప్ లోనే అశ్లీల వీడియోలు అప్ లోడ్ చేయడంతో ఆయన అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది.
ఈ కేసులో సాక్షులుగా మారిన రాజ్ కుంద్రా ఆఫీస్ కు చెందిన నలుగురు ఉద్యోగులు 'కుంద్రా అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచి ఆ యాప్ నుంచి అశ్లీల చిత్రాలను తొలగించారని తమకు చెప్పినట్టు ' పోలీసుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం.
ఇక ఈ కేసు మంగళవారం విచారణకు రావాలంటూ రావాలంటూ నటి షెర్లిన్ చోప్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.