న్యూయార్క్ లోని మన్ హటన్ లో ఉగ్ర బీభత్సం సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఓ ట్రక్కు డ్రైవర్.. బైక్ లేన్ లోకి దూసుకొచ్చి.. పాదచారులపై సైక్లిస్టులపై నిర్దాక్షిణ్యంగా ట్రక్ డ్రైవ్ చేసేశాడు. ఓ ట్రక్ ను రెంట్ కు తీసుకుని ఈ దుర్మార్గానికి ఒడికట్టగా.. ఈ సంఘటనలో 8 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు అతి సమీపంలో జరిగిన ఈ ఘటన.. 2001 సెప్టెంబర్ 11 నాటి ఘటన తర్వాత న్యూయార్క్ లో జరిగిన అంతటి విషాదకరమైన సంఘటన. ఐసిస్ కు చెందిన వ్యక్తిని అంటూ తనకు తానే ప్రకటించుకోగా.. ఇప్పుడీ సంఘటనపై హాలీవుడ్ కం బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పందించింది. అంతే కాదు.. తాను నివాసం ఉండే ఫ్లాట్ కు కేవలం 5 బ్లాక్స్ దూరంలో ఈ ఘటన జరిగినట్లుగా వెల్లడించడం సంచలనం అవుతోంది. ఉగ్ర భయాలు ఇంకా తొలగిపోలేదని తెలియచెప్పే ఈ ఘటన.. మన ప్రియాంక అపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలోనే అతి చేరువలో జరిగింది.
"ఈ ఘటన నేను ఉన్న ఇంటికి కేవలం 5 బ్లాక్స్ దూరంలో జరిగింది. నేను వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత.. సైరన్లతో ఈ ప్రాంతం అంతా మార్మోగిపోయింది" అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రియాంక వెల్లడించి.. శాంతి కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే.. ఈ ఘటనలో ప్రియాంకకు ఎలాంటి ప్రమాదం జరగనందుకు.. తమ సంతోషాన్ని తెలియచేశారు అభిమానులు అండ్ ఫాలోయర్స్.