ఓటీటీ కంటెంట్ అంటేనే వివాదాలు తప్పనిసరి అన్న ధోరణి అంతకంతకు పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టే నవతరం దర్శకులు స్క్రిప్టుల్ని సిద్ధం చేసి తెరకెక్కిస్తున్నారు. ఓటీటీకి సెన్సార్ షిప్ పరిమితులు లేకపోవడంతో అక్కడ పెట్రేగే అవకాశాన్ని ఎవరూ విడిచిపెట్టడం లేదంటే అతిశయోక్తి కాదు.
తాజాగా రిలీజైన `కృష్ణ అండ్ హిజ్ లీలా` తెలుగు చిత్రం జూన్ 25న నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది. ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమించే యువకుడి కథాంశమిది. ఒకరికి తెలిసేలా ఇంకొక అమ్మాయితో లవ్ శృంగారం అంటూ ట్రైలర్ తోనే మత్తెక్కించిన సంగతి తెలిసిందే. సిద్ధూ- శ్రద్ధా శ్రీనాథ్- సీరత్ కపూర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
అయితే ఈ మూవీలో ప్రధాన తారల పాత్రల కోసం హిందూ దేవతల పేర్లను ఉపయోగించడం .. పాత్రల లైంగిక జీవితం.. శారీరక సంబంధాలు వగైరా వ్యవహారాలను తెరపై చూపించినందుకు తాజాగా రాకేశ్ అనే ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదును చేశారు.
``శృంగార ఇతివృత్తంలో ఇతర మతాల దేవతలను కించపరుస్తూ ఆ పాత్రల్ని.. లేదా ఆ పేర్లతో పాత్రలను చూపించే ధైర్యం చేస్తారా? మతపరమైన నేపథ్యం ఎంచుకోవడం వెనక ఉద్ధేశపూర్వకమైన బలవంతం ఏదో ఉంది`` అంటూ అతడు ప్రశ్నిస్తున్నాడు. ఈ సినిమాను బహిష్కరించి వదిలేస్తే సరిపోదు.. ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి పోరాడాలని అతడు కోరుతున్నాడు. ఓటీటీలో ఆదరణ దక్కాలంటే కావాలనే ఇలాంటి జిమ్మిక్కులు ఉపయోగిస్తున్నారని ఇప్పటికే యూత్ గ్రహించింది. అలాంటి మరో జిమ్మిక్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యిందన్నమాట.