ప్రేమ‌ని మించిన ప‌రుగులు..పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యేనా?

Update: 2022-04-13 00:30 GMT
పెళ్లిళ్లు స్వ‌ర్గంలో నిశ్చ‌యించ‌బ‌డ‌తాయంటారు. అలా నిశ్చ‌యించ‌బ‌డిన జంట‌ల‌కే పెళ్లిళ్లు జ‌రుగుతాయి. ఎన్ని అవ‌రోధాలు ఎదురైనా అలాంటి జంట‌లే పెళ్లి పీఠ‌లెక్కుతాయి. వ‌ధువు మెడ‌లో మూడు ముళ్లు ప‌డ‌తాయి. జీవిత భాగ‌స్వామితో క‌లిసి ఏడు అడుగులు వేస్తారు. ఎంతో మంది ప్రేమించుకుంటారు. కానీ అవ‌న్ని పెళ్లి వ‌ర‌కూ రావు. మ‌ధ్య‌లోనే వీగిపోతాయి. పెళ్లి వ‌ర‌కూ వ‌చ్చే   జంట‌లు చాలా అరుద‌నే చెప్పాలి. అందుకే స్వ‌ర్గంలో నిశ్చ‌యించ‌బ‌డిన జంట‌ల‌కే పెళ్లిళ్లు జ‌రుగుతాయి అనే  మాట‌ల్నిల అప్పుడ‌ప్పుడు న‌మ్మాల్సి ఉంటుంద‌ని కొన్ని జంట‌ల్ని చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

పెళ్లి చేసుకుంటార‌ని క‌చ్చితంగా భావించిన జంట‌లు ఎన్నో పీఠ‌ల వ‌ర‌కూ వెళ్లి విడిపోయాయి. తాజాగా అలియాభ‌ట్-ర‌ణ‌బీర్ క‌పూర్ లు వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నో పొరొపొచ్చాలు వ‌చ్చాయి. కానీ వాట‌న్నింటిని  అధిగ‌మించి వివాహం వ‌ర‌కూ వెళ్లారు. అంత‌కు ముందు ర‌ణ‌బీర్ క‌పూర్-  దీపికా ప‌దుకొణేతో ప్రేమ‌లో ప‌డ్డాడు. పెళ్లి చేసుకుంటార‌ని  అన్నారు. కానీ ఆ ప్ర‌యాణం అంత దూరంగా సాగ‌లేదు.

ఇక న‌య‌న‌తార ఎఫైర్ల గురించి అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె జీవితంలో కి విగ్నేష్ శివ‌న్ ప్రవేశించ‌క ముందు ఇద్ద‌రి ముగ్గురితో ప్రేమాయ‌ణం నెరిపింది. ప్ర‌భుదేవాతో పెళ్లి పీఠ‌ల వ‌ర‌కూ వెళ్లి వెన‌క్కి వ‌చ్చేసింది. చివ‌రిగా విగ్నేష్  తో లాక్ అయింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రు క‌లిసే ఉంటున్నారు. పెళ్లి జ‌రిగింద‌ని కొంద‌రంటున్నారు. జ‌ర‌గ‌లేద‌ని మ‌రికొంత మంది అటున్నారు. ఏది ఎలా ఉన్నా?  విగ్నేష్ తో మాత్రం న‌య‌న్ బాండింగ్ పెళ్లి బంధాన్ని మించి స్ర్టాంగ్  గా ఉంద‌న్న‌ది ప‌చ్చి  వాస్త‌వం.

ఇక శ్ర‌తి హాసన్ - శంత‌ను హ‌జారికా బాండింగ్ చాలా బ‌లంగా ఉంద‌ని తెలుస్తోంది. మైకెల్ కోర్స‌లేకి దూర‌మైన త‌ర్వాత ఎంతో మ‌నోవేద‌న‌కు గురైన శ్రుతిహాస్ జీవితంలోకి హజారికా రాక‌తో కొత్త జీవితం మొద‌లైంది. ప్ర‌స్తుతం  ఎంతో సంతోషంగా ఉంది. చాలా బ్యాలెన్స్  డ్ గా అత‌నితో బందాన్ని ముందుకు తీసుకెళ్తోంది. గ‌త అనుభ‌వాల్ని దృష్టిలో ఉంచుకుని ప‌క‌డ్భందీగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. మైకెల్ ని మించిన అనుబంధాన్ని హ‌జారికాతో ఆస్వాదిస్తున్న‌ట్లు అమ్మ‌డి కామెంట్ల‌ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది.

ఇక  తాప్సీ కూడా ఫారెన్ బ్యాడ్మింట‌న్ కోచ్ మ‌థ‌యాస్ బోతో మంచి రిలేష‌న్ ని కొన‌సాగిస్తుంది. అత‌నితో ల‌వ్ విష‌యంలో వెరీ హ్యాపీ అంటోంది. అంత‌కు ముందు ఎన్ని అట్రాక్ష‌న్స్ ఉన్నా మ‌థ‌యాస్ ని  స‌మ్ థింగ్ స్పెష‌ల్ అంటూ పొగిడేస్తుంది. 3 ఏళ్ల రిలేష‌న్ లో ఎలాంటి డిస్ట‌బెన్స్ లేదంటే త‌దుప‌రి ఘ‌ట్టానికే వెళ్లిన‌ట్లే అన్న సంకేతాలు అదిస్తోంది.

ఇక దిశా ప‌టానీ- టైగ‌ర్ ష్రాప్ ల ప్రేమ వ్య‌వ‌హారం ఐదేళ్ల‌గా సాపీగానే సాగుతోంది. లాంగ్ ల‌స్టింగ్ రిలేష‌న్ లో ఒక‌ర్ని ఒక‌రు బాగా అర్ధం చేసుకుని ముందుకు సాగిపోతున్నారు. టైగ‌ర్ ప‌ర్ పెక్ట్ ఛాయిస్ అని దిశా సంతోషం వ్య‌క్తం చేసింది. ఇక ర‌కుల్ జీవితంలో అధికారిక భోయ్ ప్రెండ్ ఒకే ఒక్క‌డు జాకీ భ‌గ్నానీ..అత‌నితో ర‌కుల్ పెళ్లి ఖాయ‌మ‌నే స్ర్టాంగ్ గా న‌మ్ముతోందిట‌.

అలాగే కియారా అద్వాణీ-సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా బాండింగ్ చాలా బ‌లంగానే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు రిలేష‌న్ లో ఎక్క‌డా తేడాలు రాలేదు. మ‌రి ఈ ల‌బ్ బ‌ర్స్డ్  విష‌యంలో  గాడ్ స్వ‌ర్గంలో ఎలా నిశ్చ‌యించాడో కాల‌మే డిసైడ్ చేయాలి.
Tags:    

Similar News