`పుష్ప ది రైజ్` సక్సెస్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఫేమస్ అయిన మాట వాస్తవం. నటుడిగా తన సత్తా ఏంటి? అన్నది `పుష్ప` చిత్రం పాన్ ఇండియా లెవల్లో చాటింది. పుష్ప రాజ్ పాత్రల్లో ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటుడిగా బన్నీ ఇమేజ్ ని తొలి భాగం రెట్టింపు చేసింది. కానీ బన్నీ లో సిసలైన ట్యాలెంట్ మాత్రం బయట పడని సంగతి తెలిసిందే. అదే స్టైలిష్ స్టార్ గా విష్కరించిన తనలో డాన్సింగ్ స్కిల్స్ .
`పుష్ప`లో డాన్స్ పరంగా బన్నీ మార్క్ ఎక్కడా కనిపించదు. సిగ్నెచర్ స్టెప్పులుండవు..హుక్ స్టెప్పులు పెద్దగా కనిపించవు. కేవలం `శ్రీవల్లి` పాటలో సింపుల్ హుక్ స్టెప్ తోనే ఆకట్టుకుంటాడు. బన్నీ ట్యాలెంట్ కి అలాంటివి చాలా చిన్నవి. అసలు బన్నీ దృష్టిలో అది డాన్సే కాదన్నది అతని ఫ్యాన్స్ అభిప్రాయం. పాన్ ఇండియాకి బన్నీ గొప్ప డాన్సర్ అని తెలిపే ఛాన్స్ మొదటి భాగంలో దొరకలేదు. మరి ఆ ఛాన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారా? `పుష్ప ది రూల్` లో బన్నీ మార్క్ మూవ్ మెంట్స్ ఉంటాయా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది.
ఆ వివరాల్లోకి వెళ్లే బన్నీ ఇంతగా ఇన్ స్పైర్ చేసిన ఘటన గురించి గుర్తు చేయాలి. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంతో `నాటు నాటు` అంటూ మెగా వపర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు గొప్ప డాన్సర్లగా పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సైతం `నాటు నాటు` పాటకి కాలు కదిపారు. అలాగే `బీస్ట్` రిలీజ్ కి ముందే `హల్లమితి హబీబియో` సాంగ్ తో తలపతి విజయ్ ఫేమస్ అయిపోయారు.
సోషల్ మీడియాలో విజయ్ స్టెప్పులు ట్రెండింగ్ లో నిలిచాయి. ఇలా ముగ్గురు హీరోలు ఐకాన్ స్టార్ కి సవాల్ విసిరారు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సిన స్పిరిట్ బన్నీ లో రగిలినట్లు కనిపిస్తుంది. అందుకే `పుష్ప` రెండవ భాగంలో తనదైన మార్క్ స్టెప్పులతో అదరిపోవాలని కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్- జానీ మాస్టర్ లకి ఆదేశిలిచ్చినట్లు సమాచారం.
షేక్ చేసే కొన్ని క్రేజీ డాన్స్ మూవ్ మెంట్స్ కోసం తరుచూ ఆ ఇద్దర్ని బన్ని కలుస్తున్నారుట. వాటికి సంబంధించి వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే బన్ని స్టైలిష్ డాన్సర్ అని బాలీవుడ్ లో చాలా మందికి తెలుసు. ఇటీవలే అలియాభట్ కూడా బన్నీ లో స్టైలిష్ యాంగిల్ గురించి ప్రస్తావించింది.
బన్నీ లో స్టైల్ బాడీలోనే ఉందని..అతను గొప్ప డాన్సర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని కీర్తించింది. `పుష్ప ది రూల్` చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా...మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.