నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత అఖండ సినిమా తో టైటిల్ కు తగ్గట్లుగా సక్సెస్ ను దక్కించుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది చివర్లో విడుదల అయిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమా గా అఖండ నిలిచింది. దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లు సాధించినట్లుగా యూనిట్ సభ్యులు స్వయంగా ప్రకటించారు.
అఖండ సినిమా విజయంతో బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన అఖండ సినిమా అంచనాలు అందుకుని భారీ వసూళ్లు దక్కించుకున్నట్లుగానే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా కూడా అదే రేంజ్ లో వసూళ్లు చేసే అవకాశం ఉందంటూ యూనిట్ సభ్యులు నమ్మకంతో ఉన్నారు.
ఇక అఖండ సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు నమోదు చేయగానే సైలెంట్ అవ్వలేదు. ఓటీటీ లో ఈ సినిమా అత్యధిక రన్ టైమ్ రికార్డు ను నమోదు చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే. సినిమా కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. దాంతో ఓటీటీ వేదిక పై కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాను చూశారు.
తాజాగా ఓటీటీ విశ్లేషకులు మరియు హాట్ స్టార్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది లో సౌత్ ఇండియాలో విడుదల అయ్యి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాల్లో అన్నింటి కంటే అఖండ సినిమా అత్యధిక రన్ టైమ్ ను దక్కించుకుందట. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటీ అంటే థియేటర్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యిన సినిమాలతో పోల్చినా కూడా అఖండ నే నెం.1 గా నిలిచిందట.
ఇటీవల భీమ్లా నాయక్ సినిమా ను కూడా హాట్ స్టార్ వారు స్ట్రీమింగ్ చేశారు. కాని ఆ సినిమా ను ఆహా వారు కూడా స్ట్రీమింగ్ చేయడం వల్ల కాస్త స్ట్రీమింగ్ రన్ టైమ్ తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఓటీటీ లో అఖండ కుమ్మేయడం తో నిర్మాతలతో పాటు నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీ అనడంలో సందేహం లేదు. రెండు వందల కోట్ల తో పాటు ఓటీటీ లో ఈ స్థాయి వ్యూస్ ను దక్కించుకోవడం తో బాలయ్య కు పూర్వ వైభవం వచ్చిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.