ఇల్లీ బేబీ హోళీ స్పెషల్‌.. లేట్‌ అయినా లేటెస్ట్‌

Update: 2022-03-29 10:30 GMT
2006 సంవత్సరంలో దేవదాస్ సినిమా తో హీరోయిన్ గా ఇలియానా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే ఏకంగా అయిదు సినిమాల్లో నటించి అరుదైన ఘనత దక్కించుకుంది. ఆ అయిదు సినిమాల్లో ఒకటి మహేష్‌ బాబు పోకిరి, రెండు ఎన్టీఆర్‌ రాఖీ, మూడు రవితేజ 'ఖతర్నాక్‌'. ఇలా మొదటి ఏడాదిలోనే ముగ్గురు స్టార్‌ హీరోలతో నటించిన అరుదైన రికార్డ్‌ కూడా ఆమె సొంతం.

ఇక తెలుగు లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా ఇలియానాను చెప్పుకుంటూ ఉంటారు. తరుణ్‌ తో కలిసి నటించిన సినిమాలో ఈమె పారితోషికం కోటికి పైగానే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌ తో పాటు కోలీవుడ్‌ లో మంచి జోష్ మీదున్న ఈ అమ్మడికి అనూహ్యంగా బాలీవుడ్‌ నుండి బర్ఫీ అనే సినిమా తో అవకాశం రావడం.. ఆ అవకాశాన్ని సద్వినియోగించుకుని ఇలియానా బాలీవుడ్‌ లో సెటిల్‌ అవ్వడం జరిగింది.

బాలీవుడ్‌ లో దాదాపుగా అయిదు ఆరు సంవత్సరాల పాటు చాలా బిజీ హీరోయిన్ గా కొనసాగింది. అక్కడ ప్రేక్షకులను తన అందంతో అలరించడంతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని కూడా తన వైపు తిప్పుకోవడం లో సక్సెస్ అయ్యింది. ఎంతో మంది స్టార్స్ తో కలిసి నటించిన ఘనత కూడా ఈమెకు దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈమద్య కాలంలో కాస్త సినిమాల జోరు తగ్గినా సోషల్‌ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు హోళీ సందర్బంగా తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. స్నేహితులతో కలిసి ఇలియానా హోళీ ఆడుకుంటూ ఎంజాయ్ చేసిన ఆఫోటోలు సోషల్‌ మీడియా లో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాస్త ఆలస్యం అయినా కూడా కలర్‌ ఫుల్‌ ఫోటోలు మీ కోసం అన్నట్లుగా ఇలియానా ఈ ఫోటో లు షేర్‌ చేయడంతో ఎప్పటిలాగే ఆమె అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తూ హడావుడి చేస్తున్నారు.

ఆ ఫోటోల్లో ఈ ఫోటో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది. రంగుల్లో నిండి పోయిన ఇలియానా అబ్బుర పర్చే అందాల విందు చేస్తుంది. హోళీ పిక్స్ లేట్‌ గా వచ్చినా ఇలియానా హోళీ హాట్ ఫోటోలో లేటెస్ట్‌ గా ఉండి అదిరి పోయాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి. ఇల్లీ బేబీ ప్రతి యొక్క ఫోటో లో కూడా ఆకట్టుకునే రూపంలో ఉంటుంది. ఈ రంగుల్లో కూడా వావ్‌ అనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News