వాంఖేడే స్టేడియంలో కుర్ర బ్యూటీల హంగామా!

Update: 2022-04-02 06:45 GMT
ఐపీఎల్ అంటేనే హంగామా. అందులోనూ ఆస‌క్తిక‌ర మ్యాచుల్లో సెల‌బ్రిటీలు హ‌డావుడి చేస్తే ఆకిక్కే వేరుగా ఉంటుంది. నిన్న‌టి రోజున  పంజాబ్-కోల్ కొత్తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల‌ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో బాలీవుడ్ కుర్ర బ్యూటీల హంగామా మామూలుగా లేద‌నుకోండి. కోల్ క‌త్తా నైట్ రైడర్స్ కి మ‌ద్ద‌తివ్వ‌డానికి షారుక్ ఖాన్-గౌరీఖాన్ ల బృంద‌మంతా దిగిపోయింది.

గ్యాల‌రీలో వీళ్ల హంగామీ పీక్స్ లో సాగింది. కోల్ క‌త్తా కి చీర్  గాళ్స్ గా మారిపోయారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్..కుమార్తె సుహానా ఖాన్ తో పాటు  బుల్లి అబ్ర‌మ్ ఖాన్..యంగ్ హీరోయిన్ అన‌న్య  పాండే గ్యాల‌రీలో హ‌ల్చ‌ల్ చేసిన తీరు నెట్టింట వైర‌ల్ గా మారింది.

గ్యాంగ్ అంతా ఒకేచోట చేరి స్టేడియంకే వ‌న్నే తీసుకొచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సెల్ఫీలు దిగారు. ఇక మ్యాచ్ మొద‌లైన త‌ర్వాత త‌మ టీమ్ కి మ‌ద్ద‌తిస్తూ కేరింత‌ల‌తో హంగామా చేసారు. సిక్సులు..ఫోర్లు బాదుతుంటే వాళ్ల ఆనందానికి అవ‌ధుల లేవ్. చీర్ గాళ్స్ మాదిరి చెల‌రేగిపోయారు.  ప్లేయ‌ర్స్ కి ప్లైయింగ్ కిస్సులు విసురుతూ ఆక‌ట్టుకున్నారు. సుహానా ఖాన్ పసుపు రంగు బనియ‌న్ ..డెనిమ్ జీన్స్ ధ‌రించగా..అన‌న్యా పాండే వైట్ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ బ‌నియిన్..మ్యాచింగ్ జీన్స్ తో  స్టేడియంనే హీటెక్కించారు.

ఇక ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ వివాదం త‌ర్వాత బ‌ట‌య కనిపించ‌డం ఇదే మొద‌టిసారి. డార్క్ బ్లూ టీష‌ర్ట్ ధ‌రించి అంద‌రితో పాటు సెల్ఫీల్లో పాల్గొన్నాడు. హ‌డావుడ‌కి దూరంగా ఉన్నాడు. పెద్ద‌గా సంద‌డి చేయకుండా కామ్ గోయింగ్ బోయ్ లా నిన్న‌టి సాయంత్రాన్ని ముగించాడు. అత‌ని స్నేహితులు ఎవ‌రూ పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

ఇక సుహానా -అన‌న్య పాండేల ఆనందానికైతే అవ‌ధుల్లేవ్. రెట్టించిన ఉత్సాహంతో స్టేడియంలో చెల‌రేగారు. ఆ మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు  ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. నెటి జ‌నులు..షారుక్ అభిమానులు వాటిని  వైర‌ల్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు. ఈ గ్యాంగ్ ఇలా ఎంజాయ్  చేయ‌డం కొత్తేంకాదు. వీకెండ్ పార్టీలంటూ ముంబై ప‌బ్ ల్ని త‌రుచూ చుట్టేస్తుంటారు. బ‌ర్త్ డే పార్టీలు అయితే ఏకంగా అరేబియా స‌ముద్రం మ‌ధ్య‌లో భారీ నౌక‌ల‌పై సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ప్ర‌త్యేక‌త‌గా
చెప్పొచ్చు.

ఇక న‌టిగా అన‌న్య పాండే `లైగ‌ర్` సినిమాతో టాలీవుడ్లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందు. ఇందులో విజ‌య‌ల్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టిస్తోంది. షారుక్ ఖాన్ వార‌సురాలిగా సుహానాఖాన్ ఎంట్రీ కూడా ఖారారైంది. సొంత బ్యాన‌ర్ రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ద్వారానే సుహానిని లాంచ్  చేయాల‌ని షారుక్ ప్లాన్ చేస్తున్నారు. ఆర్యన్ ఖాని పెద్ద హీరోని చేయాల‌ని షారుక్ దంప‌తులు ప్లాన్ లో ఉన్నారు.
Tags:    

Similar News