విశ్వనటుడు కమల్ హాసన్ జెట్ స్పీడ్ తో షూటింగ్ లు పూర్తి చేస్తున్నారు. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `విక్రమ్` షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ పొడక్షన్ పనుల్లో ఉంది. జూన్ లో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇండియన్ -2` బ్యాలెన్స్ షూటింగ్ కి కూడా రంగం సిద్దమవుతోంది.
కొద్ది భాగం షూటింగ్ అనంతరం బ్రేక్ పడిన నేపథ్యంలో రీస్టర్ట్ కి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చివరకల్లా కమల్-శంకర్ ద్వయం `ఇండియన్-2` షూట్ మొత్తం పూర్తి చేస్తారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయి. అదే ఏడాది చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక నేపథ్యంలోనే కమల్ హాసన్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
`కొంబన్`..`మరుదు` వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. కమల్ హాసన్ గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు చేసి చాలా కాలమవుతోంది. ఫ్యామిలీ నేపథ్యం ఉన్న సినిమాలు చేసి సంవత్సరాలు గడుస్తుంది. గత కొంత కాలంగా టెక్నీకల్ బ్యాక్ డ్రాప్ సినిమాలపైనే దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు.
టెక్నాలజీ బేస్డ్ సినిమాలు చేయడం కమల్ కి మొదటి నుంచి ఎంతో ఆసక్తి. ఆ కోవలనే మారుతున్న కాలానికి తగ్గట్టు కమల్ కూడా పాత కథల్ని వదిలేసి ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో కమల్ చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమవుతున్నాయి. ఇప్పుడా ఆ గ్యాప్ ని భర్తీ చేసేందుకే గ్రామీణ నేపథ్యం ఉన్న స్ర్కిప్ట్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందులోనూ కమల్ మార్క్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.