భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టకపోతే దాని ప్రభావం సదరు హీరో తదుపరి చిత్రంపై ఖచ్చితంగా వుంటుంది. కానీ మాస్ మహారాజా రవితేజ విషయంలో మాత్రం ఆ ప్రభావం పడకపోవడం విశేషం. రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ `ఖిలాడీ` ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీని ఎఫెక్ట్ ఆయన నటిస్తున్న తదుపరి చిత్రంపై వుంటుందని అంతా భావించారు కానీ ఎలాంటి ప్రభావం చూపించలేదు.
`ఖిలాడీ` చిత్రం తరువాత రవితేజ వరుసగా నాలుగు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. శరత్ మండవ తో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. జూన్ 17న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న `రావణాసుర`, త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ `ధమాకా` చిత్రీకరణ దశలో వున్నాయి.
ఇదిలా వుంటే తాజాగా మాస్ మహారాజా మరో చిత్రాన్ని మొదలుపెట్టారు. స్టూవర్డుపురం గజదొంగగా పాపులర్ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఉగాది రోజున మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. `ఖిలాడీ` ఫలితం ఈ సినిమా పడే అవకాశం వుందని అంతా భావించారు. కానీ దాని ప్రభావం టైగర్ పై ఏ మాత్రకం పడలేదని తెలుస్తోంది.
ఇందుకు నిదర్శనమే ఈ మూవీ బడ్జెట్ అని తెలుస్తోంది. `ఖిలాడీ` చిత్రానికి 45 కోట్లు ఖర్చు చేశారట. అయితే `టైగర్ నాగేశ్వరరావు` బయోపిక్ కోసం ఏకంగా 50 కోట్లు బడ్జెట్ ని కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ బడ్జెట్ మేకింగ్ ని బట్టి మరింతగా పెరిగే అవకాశాలు కూడా వున్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టర్ కొత్త వాడైనా.. హీరో రవితేజ ప్రీవియస్ ఫిల్మ్ భారీ నష్టాలని అందించినా టైగర్ ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడటం లేదు. స్టోరీపై వున్న నమ్మకంతో భారీ బడ్జెట్ ని కేటాయించడం విశేషంగా చెప్పుకుంటున్నారు.
ఇక ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ లు నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా రవితేజ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రవితేజ కెరీర్ లోనే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న తొలి మూవీ ఇదే కావడం గమనార్హం. రీసెంట్ గా కశ్మీరీ పండిట్ ల దారుణ మారణ కాండ నేపథ్యంలో రూపొందిన చిత్రం `ది కశ్మీర్ ఫైల్స్`. ఈ చిత్రాన్ని నిర్మించి దేశ వ్యాప్తంగా ప్రశంసలతో పాటు భారీ లాభాల్ని సొంతం చేసుకున్న మేకర్స్ ఆ జోష్ తో `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.