న‌వ‌మి రోజున నిరుత్సాహ‌ప‌రిచిన `ఆదిపురుష్‌`

Update: 2022-04-10 07:40 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ `ఆదిపురుష్` రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. `రామాయ‌ణం` ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. రామాయ‌ణంలో ప్ర‌తీ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాటికి `ఆదిపురుష్` రూపంలో ద‌ర్శ‌కుడు ఓంరౌత్ దృశ్య‌రూపాన్ని ఇచ్చి  ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డం అన్న‌ది నిజంగా ఎంతో సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం.

ఈ నేప‌థ్యంలో `ఆదిపురుష్` లో రాముడి పాత్ర‌లో డార్లింగ్ ఎలా క‌నిపిస్తాడు? అని ఒక‌టే ఉత్కంఠ అభిమానుల్లో నెల‌కొంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని అంత‌కంత‌కు పెంచేస్తున్నాయి. ఇటీవ‌లే  ఆ అంచ‌నాల్ని రెట్టింపు చేస్తూ ద‌ర్శ‌కుడు ఓం రౌత్  రాముడి పాత్ర గురించి ఆస‌క్తిక‌ర విశేషాలు వెల్ల‌డించారు. క‌థ‌లో రాముడి వైభ‌వం..వైభ‌వాన్ని ఎంతో గొప్ప‌గా చూపించ‌బోతున్నాం. ప్రేక్ష‌కుల ఊహ‌కు అంద‌ని విధంగా స‌న్నివేశాలు హైలైట్ గా ఉంటాయి.

రామాయ‌ణం ఎప్పుడు బ‌ల‌మైన ప్ర‌భావాన్ని క‌ల్గి ఉంటుంది. రాముడి పరాక్ర‌మ శైలిని సినిమాలో హైలైట్ చేస్తున్నామ‌న్నారు. అయితే ఈరోజు శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా సినిమా గురించి మ‌రిన్ని అప్ డేట్స్ ఉంటాయని అభిమానులు  నిన్న‌టి రాత్రి నుంచి క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. సీతారాముల క‌ళ్యాణోత్స‌వం సంద‌ర్భంగా ఈరోజున  క‌చ్చితంగా సినిమా నుంచి స‌మ్ థింగ్ స్పెషల్ ఉంటుంద‌ని..ముఖ్యంగా టీజ‌ర్ ట్రీట్ ఉంటుంద‌ని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఆశ‌ల‌న్నింటిపైనా నీళ్లు చ‌ల్లేసారు.

అయితే ఆ ట్రీట్ కి బ‌ధులుగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని పోస్ట్ చేసారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ అభిమానులు షేర్  చేసిన ఫ్యాన్ మేడ్ ప్ర‌భాస్ శ్రీరాముడి గెట‌ప్ పోస్ట‌ర్ల‌ల‌ను అన్నింటిని ఒక‌టి చేసి వీడియో రూపంలో న‌వ‌మి సంద‌ర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ఫ్యాన్ మేడ్ ప్ర‌జెంటింగ్ పేరుతో వీటిని ట్విట‌ర్లో అద్భుత‌మైన బీజీఎమ్ ఇచ్చి షేర్ చేసారు. నిజంగా ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు  అద్భుతంగా ఉన్నాయ‌ని చెప్పాలి.

సినిమాలో శ్రీరాముడి గెట‌ప్ ని ఎంత అందంగా ఆవిష్క‌రిస్తారో తెలియ‌దుగానీ..ఫ్యాన్స్ మాత్రం పోటీ ప‌డి మ‌రి ప్ర‌భాస్ శ్రీరాముడి లుక్ ని ఎంతో అందంగా..వైభంగా డిజైన్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇక రిలీజ్ తేదిని కూడా ఓం రౌత్ మ‌రోసారి ఖ‌రారు చేసారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇందులో మ‌రోసారి ప్ర‌క‌టించారు. Full ViewFull View
Tags:    

Similar News