మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో `ఆర్ సీ 15` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో చరణ్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. హైదరాబాద్..రాజమండ్రి ప్రాంతాల్లోనే రెండు షెడ్యూళ్లని పూర్తి చేసారు. ప్రస్తుతం టీమ్ మూడవ షెడ్యూల్ కి రంగం సిద్దం చేస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ నటించిన `ఆర్ ఆర్ ఆర్` కూడా రిలీజ్ అవ్వడంతో చరణ్ ఫ్రీ అయిపోయారు.
దీంతో పూర్తిగా శంకర్ సినిమా షూటింగ్ పైనే ఫోకస్ చేయనున్నారు. ఇక ఈకాంబినేషన్ లో `ఒకే ఒక్కడు`..`భారతీయుడు` రేంజ్ మూవీ తెరకెక్కుతుందని అంచనాలు మిన్నంటుతోన్న సంగతి తెలిసిందే. చరణ్ రెండు డిఫరెంట్స్ షెడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారని సినిమా ప్రారంభానికి ముందు నుంచే వినిపిస్తోంది. ఐఏఎస్ అధికారిగా...రాజకీయ నాయకుడిగా రెండు డిఫరెంట్ వేరిషేన్స్ ఉన్న పాత్రల్లో మెప్పించనున్నారని చాలా కాలంగానే వినిపిస్తోంది.
ఆ ప్రచారంతోనే కంటెంట్ పరంగా శంకర్ మార్క్ చిత్రంగా తెరకెక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోసారి ఇదే విషయం తెరపైకి వస్తోంది. ఇందులో చరణ్ డ్యూయల్ మోడ్ పాత్రల్లో మెప్పించనున్నారని సన్నిహిత వర్గాల నుంచి లీకులందుతున్నాయి. అయితే ఈసారి డ్యూయల్ మోడ్ లో ఒక రోల్ పూర్తిగా ఛేంజ్ అయినట్లు తెలుస్తోంది.
ఒక పాత్రలో స్టూడెంట్ గా కనిపించనున్నారని..మరో పాత్రలో జిల్లా కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు.
`మగధీర`..`నాయక్` చిత్రాల్లో చరణ్ పాత్రల తరహాలోనే `ఆర్ సీ 15` లో రెండు పాత్రల్ని డిజైన్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఒక రోల్ ని పూర్తిగా యాక్షన్ హీరోగా ఎలివేట్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ తో కట్టిపడేసాలా ఆ రోల్ డిజైన్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.
ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి చరణ్ ట్రాన్సపర్మేషన్ ఎగ్జైట్ మెంట్ తీసుకొస్తుందని గుసగుస వినిపిస్తుంది. అందులో శంకర్ మార్క్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. శంకర్ స్ర్కిప్ట్ లు సొసైటీని ఇన్ స్పైర్ చేసేలా ఉంటాయి. ఇది అలాంటి కథాంశమేనని తెలుస్తోంది. చరణ్ డ్యూయల్ మోడ్ కి శంకర్ మార్క్ టచ్ అప్ తో పూర్తి కమర్శియల్ సినిమాగా హైలైట్ అవుతుందని అంటున్నారు. మరి అసలు సంగతేంటి? అన్నది ఇంకొన్ని నెలలు వెయిట్ చేస్తే గాని తెలియదు.
ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కి జోడీగా కియారా అద్వాణి నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.