బాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ వివాహ బంధంతో ఒకటవ్వడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి భార్యభర్తలుగా ఏడు అడుగులు వేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. అన్ని రకాల పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేసి నవ దంతపతుల్లా ఆకర్షించబోతున్నారు. పెళ్లి తేది ఇంకా పక్కాగా బయటకు రాలేదు గానీ ఈ వారంలో పెళ్లి భాజాలు మ్రోగడం ఖాయంగా కనిపిస్తుంది.
ఏప్రిల్ 13 నుంచి 17 తేదీల్లో పెళ్లి వేడుకలకు రంగం సిద్దమవుతున్నట్లు మాచారం. వేకువజామున ఉదయం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో రణబీర్ ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మెహందీ..సంగీత్..కాక్ టెయిల్ పార్టీ వేడుకలు చెంబూరులోని ఆరే. కే స్టూడియోలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆర్ కే స్టూడియో ముస్తాబవుతుంది.
ఇక పెళ్లి వేదిక ముంబై బాంద్రాలోని రణబీర్ కపూర్ ఇంట్లో వైభంగా జరగనుంది. తండ్రి రిషి కపూర్ కోరిక మేరకు ఊరంత పందిరేసి భారీ ఎత్తున వివాహాన్ని అక్కడే జరిపించాలని నిర్ణయించడంతో వేదిక అదే అని తెలుస్తోంది. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా భన్సాలీ.. అర్జున్ కపూర్.. ఆయాన్ ముఖర్జీ.. జోయా అక్తర్.. సైఫ్ అలీఖాన్.. తదితరులు హాజరవుతున్నట్లు సమాచారం.
వివాహం అనంతరం ఈ జంట సెలబ్రిటీలు..పారిశ్రామిక..రాజకీయ వేత్తల కోసం భారీ ఎత్తున ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పార్ట్ -5 స్టార్ హోటల్ బాల్ రూమ్ లో రాత్రి 9 గంటల కు రిసెప్సన్ మొదలు కానుందని సమాచారం.ల
అలియాభట్-రణబీర్ వివాహానికి దాదాపు 200 మంది బౌన్సర్లతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు గత నెల రోజులుగా జరుగుతున్నాయి. ఇక వివాహం అనంతరం హానీమూన్ కి ఆఫ్రికా వెళ్లనున్నారని సమాచారం. ఇప్పటికే ఇద్దరు ఇదే ఖండాన్ని పెళ్లికి ముందు రెండుసార్లు చుట్టేసారు. ముచ్చటగా మూడవసారి వివాహం అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలిసిన ప్రాంతానికే వెళ్లాలని నిర్ణయించుకుని హానీ మూన్ స్పాట్ గా ఆఫ్రికాని ఫిక్స్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.