రవితేజ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మరో వైపు ఈయన నటిస్తున్న ధమాకా సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. మరో వైపు చిరంజీవితో కలిసి వాల్తేరు వీరన్న సినిమాలో బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు.
ఇన్ని సినిమాలు కాకుండా రాక్షసుడు అనే సినిమాను కూడా ఇప్పటికే ప్రారంభించాడు. ఈ ఏడాది రవితేజ సినిమాల జాతర కంటిన్యూ అన్నట్లుగా మరో సినిమాను మొదలు పెట్టేందుకు రవితేజ సిద్దం అయ్యాడు. ఆమద్య రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా ను ప్రకటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా అనుకున్నా కొన్ని కారణాల వల్ల రవితేజ వద్దకు వచ్చింది.
రవితేజ ఖచ్చితంగా టైగర్ నాగేశ్వరరావు పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఏప్రిల్ 2వ తారీకున ఈ సినిమా ముహూర్తం ను ఖరారు చేయడం జరిగింది. అంతే కాకుండా ఆ రోజు రవితేజ టైగర్ నాగేశ్వరరావు లుక్ ను కూడా రివీల్ చేస్తారట.
టైగర్ నాగేశ్వరరావు ఒక గజ దొంగగా పేరు మోశాడు. ఆయన ఎంతో మందికి సాయం చేయడం తో పాటు ఎన్నో దొంగతనాల కేసుల్లో దోషిగా ఉన్నాడు. ఆయన పోలీసులకు అప్పట్లో చుక్కలు చూపించాడు అనేది టాక్. ఆయన దొంగతనాల వెనుక ఒక మంచి ఉద్దేశ్యం ఉండేది అంటూ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు విషయం ఏంటీ అనేది తెలియదు.
రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్న ఈ సినిమా లో టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్రను కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా రవితేజ ఇమేజ్ కు తగ్గట్లుగా తెరకెక్కించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఏప్రిల్ 2న సినిమా షూటింగ్ ప్రారంభం అంటూ ప్రకటించేందుకు షేర్ చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. తాళం పగులకొట్టి.. దానికి రక్తం ఉండటంతో కాస్త ఎక్కువ ఆసక్తిని కలిగేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.