అనిరుధ్ ఓకేసారి 10.. ఎలా కొడుతున్నావయ్యా?

Update: 2023-06-01 08:00 GMT
మొన్నటి వరకు మ్యూజిక్ అంటే అన్ని సినిమాలకు ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అంటే డీఎస్పీ పేరు వినపడేది. ఆ తర్వాత లైన్ లోకి తమన్ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం  మొత్తం అనిరుధ్ మాయాజాలమే. ఏ హీరో సినిమా చూసినా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ పేరే వినపడుతోంది. టాలీవుడ్ , కోలీవుడ్ లోని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అనిరుధ్ తో పనిచేయాలని కోరుకుంటున్నారు. అంత క్రేజ్, స్టార్ డమ్ ని ఆయన సంపాదించుకున్నారు ప్రస్తుతం అనిరుధ్ ఎంత బిజీగా ఉన్నాడు అంటే తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలో దాదాపు ఆయన స్టార్ హీరోలతో 10 కి పైగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ సినిమా కి మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక, తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీయెస్ట్ చిత్రం లియో కి కూడా అనిరుధ్  మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

కమల్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు2  సినిమాకి , రజినీకాంత్ జైలర్, షారూక్ ఖాన్-అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జవాన్, విజయ్ దేవర కొండ 12వ సినిమా ఆ తర్వాత అజిత్, శింబు లాంటి హీరోల సినిమాలకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తుండటం విశేషం. ఇవి మాత్రమే కాదు, మరి కొన్ని ప్రాజెక్టుల విషయంలోనూ చర్చలు జరుగుతున్నాయట.

అనిరుధ్ 2022లో తమిళ సినిమా విక్రమ్, డాన్, బీస్ట్ , కాతువాకుల రెండు కాదల్ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో, ప్రస్తుత కాలంలో అనిరుధ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఇక తెలుగు విషయానికి వస్తే, గతంలో అజ్నాతవాసి సినిమా అనిరుధ్ అందించాడు. ఎన్టీఆర్ అరవింద సమేతకు మొదట మ్యూజిక్ అనిరుధ్ ఇవ్వాల్సి ఉండే, కానీ కుదరలేదు. ఇప్పుడు దేవరతో ఆ కాంబినేషన్ కుదిరింది.

Similar News