మాస్ అవతార్ లో నానిని యాక్సప్ట్ చేసినట్లేనా?

Update: 2023-03-16 07:00 GMT
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నటుడిగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. పక్కింటి కుర్రాడి తరహా పాత్రలతో ప్రేక్షకులకి చేరువ అయిన నాని ఇప్పుడు టాలీవుడ్ లో టైర్ 2 స్టార్ హీరోల జాబితాలో ఒకడిగా ఉన్నాడు. అతని కెరియర్ లో భలే భలే మగాడివోయ్ సినిమా కెరియర్ పరంగా నానికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా మూవీస్ చేస్తూ వచ్చారు. ఇక శ్యామ్ సింగరాయ్ లో రెండు భిన్నమైన షేడ్స్ లో నటించి సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే నాని కెరియర్ లో ఎక్కువగా క్లాస్ లుక్ తోనే సినిమాలు చేశాడు. పైసా, జెండాపై కపిరాజు, కృష్ణార్జున యుద్ధం సినిమాలు మాస్ అవతార్ తో చేసిన వాటికి ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అయితే చాలా కాలం తర్వాత మరల పూర్తి స్థాయిలో మాస్ అవతార్ లోకి నాని మారిపోయాడు. తెలంగాణలో సింగరేణి సమీపంలో జరిగిన ఓ చిన్న గ్రామంలో జరిగిన కథగా  ఈ మూవీని దర్శకుడు ఆవిష్కరించాడు. ఇక అతని క్యారెక్టర్ గ్రామంలో బాధ్యత లేకుండా తిరిగే ఒక రెబలిస్టిక్ గా ఆవిష్కరించాడు.

దానికి తగ్గట్లే అతను లుక్, ఆహార్యం అంతా ఉంది. పక్కా నాటు క్యారెక్టర్ పాత్రలో నాని పరకాయ ప్రవేశం చేసి దసరా మూవీ చేశాడని చెప్పాలి. తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తూ ఉంటే దసరా సినిమాలో ధరణి అనే పాత్ర తప్ప నాని అనే బ్రాండ్ ఎక్కడా కనిపించడం లేదని చెప్పాలి. అంతగా పాత్రకి ప్రాణం పోసాడు. ఇక గత సినిమాల విషయంలో నాని మాస్ అవతార్ లో నటుడిగా అయితే ఫెయిల్ కాలేదు.

కేవలం ఆ సినిమాల కంటెంట్ కి మాత్రమే కనెక్ట్ కాలేదు. అలాగే ఈ సినిమాలో కూడా నాని పాత్రకి ప్రేక్షకులు భాగానే కనెక్ట్ అయ్యారు. స్టార్ హీరోలు క్లాస్ రోల్స్ చేస్తూ ఒకేసారి మాస్ అవతార్ లోకి మారితే ప్రేక్షకులు అంత ఈజీగా యాక్సప్ట్ చేయలేరు. అయితే నాని విషయం మాత్రం ప్రేక్షకుల అంగీకారం లభించింది అని చెప్పాలి. మరి ఈ మూవీ కంటెంట్ పరంగా ప్రేక్షకులని మెప్పిస్తే మాత్రం నాని కెరియర్ లో ఒక అద్భుతమైన చిత్రంగా మారే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News