నేను తిరుగుబోతునే.. రిలీజ్ చేయండి ప్లీజ్

Update: 2017-04-04 11:45 GMT
హిందీ టీవీ సీరియల్స్ నటించేసి.. ఏషియాలో భారీ క్రేజ్ సంపాదించుకున్న భామ నియా శర్మ. టాలీవుడ్ జనాలకు గతంలో పెద్దగా పరిచయం లేదు కానీ.. రీసెంట్ గా ఏషియా సెక్సియెస్ట్ ఉమన్  లిస్ట్ లో మూడో స్థానం సంపాదించి.. అందరి అలర్ట్ సంపాదించేసింది.

ఈ స్థానం కోసం చాలామంది సెక్సీ బాలీవుడ్ బేబ్స్ ను కూడా ఓడించేసింది. సడెన్ గా వచ్చిన క్రేజ్ ను మరింతగా పెంచుకోవడం కోసం.. ఇన్ స్టాగ్రామ్ ను వేదికగా చేసుకున్న నియా శర్మ.. తన సోషల్ పేజ్ లో బోలెడన్ని హాట్ హాట్ ఫోటోస్ పెట్టేసింది. మరి ఇది ఎవరికి నచ్చలేదో కానీ.. సడెన్ గా ఈమె ఇన్ స్టా అకౌంట్ ను హ్యాక్ చేసేసి ప్రస్తుతం హైడ్ చేసేశారు. అంతే కాదు.. ఇలాంటి బిచ్ కు సోషల్ అకౌంట్ అవసరం లేదంటూ.. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలెట్ చేస్తామని కూడా బెదిరించేశారు. దీనికి ఈమె నుంచి వచ్చిన రియాక్షన్ మరీ టూమచ్ గా ఉంది.

"అవును.. నేను బిచ్ నే కావచ్చు. కానీ నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను చాలా ప్రేమిస్తాను. ప్లీజ్ దాన్ని రిలీజ్ చేయండి. మీరు నా అకౌంట్ తో అడుకోవడం అయిపోతే రిలీజ్ చేసేయండి. అది నా శరీర భాగాల్లో ఒకటిగా మారిపోయింది. ప్లీజ్ రిలీజ్" అంటూ తన ట్విట్టర్ పేజ్ లో అభ్యర్ధించింది నియా శర్మ.

క్లిక్ చేయండి : నియా శర్మ హాట్ ఫొటోస్

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News