స్ట‌న్నింగ్ అంటూ టీవీ న‌టి వెంట ప‌డ్డాడు!

Update: 2022-01-30 13:21 GMT
టీవీ మూవీ న‌టి నియా శర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ నిరంత‌రం హాటెస్ట్ ఫోటోషూట్స్ తో నెటిజ‌నుల్లో ట్రెండింగ్ గా మారుతోంది. తాజాగా మ‌రో కొత్త ఫోటోషూట్ తో నియా మైండ్ బ్లాక్ చేసింది. వైట్ డిజైన‌ర్ లుక్ దానికి కాంట్రాస్ట్ గా బ్లాక్ బ్యాక్ లెస్ దుస్తులను ధరించిన కొత్త ఫోటోషూట్లు ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో అగ్గి రాజేస్తున్నాయి. ఆమె అభిమానుల నుండి ప్రత్యేక సమీక్షలు వేడెక్కిస్తున్నాయి.

నియా శర్మ హిందీ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలోని హాటీస్ లో త‌న స్థాయిని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళుతోంది. అందాల నియా తన కెరీర్ లో లెక్కలేనన్ని సిజ్లింగ్ హాట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డినా ప్రతిసారీ కొత్త‌ద‌నం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఫోటోషూట్ లేదా ర్యాంప్ ప్రదర్శనల కోసం లేదా ఆమె ఆఫ్-స్క్రీన్ దుస్తుల ఎంపిక ఎంతో విల‌క్ష‌ణం గా ఉంటుంది. ఇటీవల నియా వింతైన రూపంతో కొత్త డిజైన‌ర్ లుక్ తో క‌నిపించింది. దీనికి ఆమె అభిమానుల నుండి చాలా అద్బుత‌ స్పందన వచ్చింది! నటి తెలుపు రంగు డిజైన‌ర్ దుస్తులను ధరించి అందాల్ని ఆరాంగా ఓపెన‌ప్ చేసిన ఫోజులు వైర‌ల్ గా మారాయి. ఈ లుక్ లో నియా అద్భుతంగా ఉంది! కానీ ఆమె తన ఈ దుస్తులకు సానుకూల వ్యాఖ్యలతో పాటు కామెంట్లు ఎదుర్కోక త‌ప్ప‌లేదు. నియా స్కార్చింగ్ లుక్‌కి అభిమానులు హార్ట్ ఈమోజీల్ని షేర్ చేసి ప్రేమను కురిపించారు.

ఇది సాత్ సముండే పార్ లాంచ్ కోసం జరిగిన ఫోటోషూట్. ఆమె నల్లటి దుస్తులు హాల్టర్ నెక్ లైన్ ఒక స్టైల్ కాగా వైట్ డిజైన‌ర్ లుక్ ఇంకో స్టైల్ అంటూ పొగిడేశారు. ప్లంగింగ్ .. వీ కట్-అవుట్ సైడ్ .. చివరగా బ్యాక్ లెస్ లుక్‌తో కూడిన సుందరమైన దుస్తులు ధ‌రించింది. ఇంత‌టి సొగ‌సు చూసాక‌ నియా అభిమానులను ఆప‌డం అంత క‌ష్ట‌మేమీ కాదు. నటి నియా క్యాప్షన్ లో ఇలా రాసింది, "నాకు బయటకు వెళ్లడం పెద్దగా ఇష్టం లేదు.. కానీ డ్రెస్సింగ్ ఆలోచన నాకు ఇష్టం.. అయితే అది ఎలా పని చేస్తుందో తెలియదు…`` అని పేర్కొంది. హాట్ లుక్ కి ఆమె అభిమానులు వెంటనే ఫిదా అయ్యారు! ఒక ఇన్ స్టాగ్రామ్ వినియోగదారు క్యాప్షన్ లలో ``నేను మీలాగే అందంగా ఉండగలనని ఆశిస్తున్నాను` అని రాశారు. హార్ట్ ఈమోజీల‌తో వ్యాఖ్యను ముగించారు.

మరొక కామెంట్ లో ఒక వినియోగదారు "అద్భుతంగా కనిపిస్తున్నారు" అని రాశారు. ``స్టన్నర్`` అంటూ హృదయ ఎమోజితో మ‌రొక‌రు వ్యాఖ్యానంచ‌గా.. ఒక వినియోగదారు "లుకింగ్ ఫ్యాబులస్" అంటూ పొగిడేశాడు. ఎల్లప్పుడూ గార్జియస్ అంటూ మరొక వ్యాఖ్యాత రాశారు. కొన్ని ఫ్లేమ్ ఎమోజీలు కూడా అభిమానులు షేర్ చేశారు.

నియా చివరిసారిగా నాగిన్ 5 లో కనిపించింది. అందులో బృందా అనే పాత్రను పోషించింది. లాక్ డౌన్ కారణంగా ఈ థ్రిల్లర్ సీరియ‌ల్ చిత్రీక‌ర‌ణ‌ ఆగిపోయింది. ఆ త‌ర్వాత టీఆర్పీ ఆశించినంత లేక‌పోవ‌డంతో పూర్తిగా ఆపేశార‌ని తెలిసింది.
Tags:    

Similar News