సతీమణికి పబ్లిక్ లో కిస్సిచ్చిన నిక్కుగారు!

Update: 2019-05-02 09:21 GMT
ఇంటర్నేషనల్ మీడియా అంతా ఫాలో అయ్యే జంటలలో ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ జంట ఒకటి.  సోషల్ మీడియాలో అయితే వారికి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.  కొద్ది రోజుల క్రితం ప్రియాంక - నిక్ జంట విడాకుల దిశగా పయనిస్తోంది 'ఓకే' అనే బ్రిటిష్ మ్యాగజైన్ కథనం ప్రచురిస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.  కానీ ఆ తర్వాత సదరు కథనం ఉత్తుత్తిదేనని తేలిపోయింది.  ఇక అప్పటి నుంచి ప్రియాంక - నిక్ జంట జోరు పెరిగింది..  పీడీఏ ఎక్కువైంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి పీడీఏ ఏంటో తెలిసే ఉంటుంది. పబ్లిక్ డిస్ ప్లే ఆఫ్ అఫెక్షన్.  దాన్ని ఈమధ్య నిక్ అండ్ మిసెస్ నిక్ ఎక్కువ చేయడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దీంతో ఓకే లాంటి మరో మ్యాగజైన్ విడాకుల కథనాలు ఇప్పట్లో ప్రచురించలేరని వారి ఆనందం. ఇక రీసెంట్ గా ఏం జరిగిందంటే నిక్.. ప్రియాంక.. ఇతర నిక్ కుటుంబ సభ్యులు బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ 2019 ఈవెంట్ కు హాజరయ్యారు. నిక్ జోనాస్ ఒక పాపులర్ సింగర్ అనే సంగతి తెలిసిందే. నిక్ అన్నదమ్ములు జో.. కెవిన్ జోనాస్ లు కలిసి జోనాస్ బ్రదర్స్ పేరుతో మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తుంటారు.  అందరూ సింగర్స్ కాబట్టి ఈ కార్యక్రమంలో వారిది ఫుల్ సందడి.  అయితే నిక్ ఉత్సాహం కాస్త ఎక్కువై తన ప్రియమైన సతీమణి వద్దకు వచ్చి ఓ తీయనైన ముద్దిచ్చాడు.  ప్రియాంక కాలేజిలో కపుల్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదువుకుందేమో కానీ నిక్ తన దగ్గరకు రాగానే కాస్త ముందుకు వంగి నిక్ కు అనుకూలంగా తన పెదవులను పెట్టింది.

ఇలాంటి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైన తర్వాత జనాలు వీడియో తీయడం..  ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కాకుండా ఉంటుందా? అయింది.  తెగ వైరల్ అయింది.  లైకులతో షేర్లతో సోషల్ మీడియా హోరెత్తింది. అసలు అఫెక్షన్ అంటే నిక్..ప్రియాంక జంటదేనని మెచ్చుకున్నారు. కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారని ఇంగ్లీష్ లో ప్రశంసించారు.  ఏదేమైనా ఒకటి మాత్రం నిజం. నిక్.. ప్రియాంకల మధ్య ప్రేమ ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది. ఇది బ్రిటన్ లో ఉన్న ఓకే మ్యాగజైన్ వారికి మింగుడుపడని వ్యవహారమే.. విడాకులుంటూ రచ్చ చేస్తే వీరు వీర ప్రేమికులలాగా మరిపోయారు.  ఓకే  వారి కథనం ఫైనల్ గా లగడపాటి ప్రకటించిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సర్వేలాగా తయారైంది..!

For Video Click Here

Tags:    

Similar News