నిక్కీ తంబోలి అనే పేరు చెప్తే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కాని చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున అందరు గుర్తిస్తారు. ఆమెను తెలుగు ప్రేక్షకులు మొదటి సినిమాతోనే ఆధరించారు. ఆకట్టుకునే రూపంతో పాటు అందరిని కట్టిపడేసే ఫిజిక్ ను కలిగి ఉన్న నిక్కీ తంబోలి ఇటీవల బిగ్ బాస్ ద్వారా మరింతగా గుర్తింపు దక్కించుకుంది. పెద్దగా ప్రాచార్యం లేని సెలబ్రెటీగా హిందీ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె తన పద్దతి మరియు ప్రవర్తనతో అభిమానులను దక్కించుకుంది. దాంతో ఆమెకు ఏకంగా బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచే అవకాశం దక్కింది. బిగ్ బాస్ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా మరింతగా పుంజుకుంది.
అద్బుతమైన ఆమె కెరీర్ దూసుకు పోతున్న ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. గతంలో కొన్ని సార్లు బ్రేకప్ అవ్వడం వల్ల ఆమె మళ్లీ ప్రేమ అంటేనే ఇష్టపడటం లేదు. ఆమె ప్రేమ విషయంలో ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆమె ఇకపై టైమ్ పాస్ ప్రేమ ను చేసేది లేదు. ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం కూడా కెరీర్ పైనే అని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను కాని మళ్లీ ప్రేమ గురించి ఆలోచించను అంటూ చెప్పేసింది. ప్రేమ విషయంలో తన అభిప్రాయం గతంతో పోల్చితే ఇప్పుడు మారినట్లుగా ఆమె చెప్పింది. ప్రేమ వల్ల కెరీర్ ఎఫెక్ట్ అవ్వకూడదు అని తాను భావిస్తున్నట్లుగా పేర్కొంది.
తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమా తర్వాత ఈమె తమిళంలో కాంచన 3 లో నటించింది. మళ్లీ తెలుగు లో తిప్పర మీసం లో కూడా ఛాన్స్ ను ఈమె దక్కించుకుంది. తెలుగు లో ఈమె కు ఆ తర్వాత రెండు మూడు ఆఫర్లు వచ్చినా కూడా బిగ్ బాస్ నుండి పిలుపు రావడం వల్ల తిరష్కరించింది. బిగ్ బాస్ లో రన్నరప్ గా నిలిచిన ఈమె ఆ తర్వాత ఖత్రోన్ కే ఖిలాడి అనే టీవీ షో ను చేసింది. ఆ షో కు రోహిత్ శెట్టి హోస్టింగ్ చేస్తున్నాడు. ఆ షో లో ఈమె ఆశించిన స్థాయిలో ప్రదర్శణ కనబర్చలేదు. అయినా కూడా ఈమెకు ఉత్తరాదిన మంచి ఆఫర్లు వస్తున్నాయి.
సినిమా లు మరియు వెబ్ సిరీస్ లతో ఈమె అతి త్వరలో అక్కడ బిజీ యాక్ట్రెస్ గా మారడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అయిదు మ్యూజిక్ వీడియోలను కూడా ఈమె ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. హీరోయిన్ గా బుల్లి తెరపై మరియు వెండి తెరపై ఇలా రక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రేమ విషయంలో మాత్రం టైమ్ పాస్ చేయాలనుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.