ఫోటో స్టోరీ: డెనిమ్ షార్ట్.. డెడ్లీ లుక్

Update: 2019-12-03 10:25 GMT
తరం మారేకొద్దీ కొత్త భామలు ఇండస్ట్రీలోకి రావడం చాలా సహజం.  అలానే ఈమధ్య టాలీవుడ్లో కొత్త భామల హవా సాగుతోంది.  ఈతరం భామల్లో నిధి అగర్వాల్ ఒకరు.  ఇప్పటివరకూ నటించింది మూడు నాలుగు సినిమాలే అయినా 'ఇస్మార్ట్ శంకర్' తో భారీ విజయాన్ని అందుకుని హాట్ షాట్ హీరోయిన్ ల జాబితాలో చేరింది.  ఇక సోషల్ మీడియాలో మంటలు పెట్టే కిటుకులు కూడా పూరి జగన్నాధ్ స్కూల్ అఫ్ హాట్ సైన్సెస్ లో నేర్చుకున్నట్టుంది.

ఈమధ్య నిధి అలా నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది.  సాధారణ భామలను అలా ఫోటోలు తీస్తే 'దంతములు ఊడి కిందపడుట' అనే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి హీరోయిన్ల ను ఫోటోలు తీస్తే అలాంటి విపత్కర పరిణామాలు ఎదురుకావు.  అందుకే ఎడాపెడా ఫోటోలు తీసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు.  ఈ ఫోటోలలో నిధి వైట్ టీ షర్టు.. ఎంతో పొట్టిగా ఉండే డెనిమ్ షార్ట్ ధరించింది.. ఇన్ షర్టు చేసుకొని ఒక బెల్టు కూడా పెట్టుకుంది. ఇక వయ్యారంగా నడుస్తూ పోవడంతో కెమెరాలో బంధించారు. ఫోటో షూట్లు అంటే తయారయ్యేందుకు.. డిజిటల్ మేకప్ కు అవకాశం ఉంటుంది. నలభై ఏళ్ళ భామల ఫెసులను కూడా ఇరవైల పాపల తరహాలో మార్చ వచ్చు. కానీ ఇలాంటి ఫోటోలకు ఆ చాన్స్ఉండదు. ఎలా ఉంటే అలా కనిపిస్తారు. నిధి ఈ ఫోటోలలో బొమ్మలా కనిపిస్తుందంటే నమ్మండి.  

ఎంతైనా ఇస్మార్ట్ బ్యూటీ కదా.. ఇలా కనిపిస్తే ఫోటోలకు లైక్స్ రాకుండా ఎలా ఉంటాయి.  సోషల్ మీడియాలో ఫుల్ గా లైక్స్ వచ్చాయి.  ఇక సినిమాల విషయానికి వస్తే అశోక్ గల్లాడెబ్యూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాతో పాటుగా తమిళంలో 'భూమి' అనే చిత్రంలో నటిస్తోంది.
Tags:    

Similar News