బాలీవుడ్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య మరియు అఖిల్ లతో విడి విడిగా నటిస్తున్న విషయం తెల్సిందే. నాగచైతన్యతో ‘సవ్యసాచి’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరో వైపు బాలీవుడ్లో కూడా ఈ అమ్మడు నటిస్తూనే మోడలింగ్ కూడా చేస్తూ ఉంటుంది.
తాజాగా జిక్యూ నిర్వహించిన ఒక అవార్డు వేడుకలో నిధి అగర్వాల్ పాల్గొంది. రెడ్ కార్పెట్‌పై వాక్ చేసిన ఈ అమ్మడు తన అందాలు ఆరబోయడంతో కెమెరామెన్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఇలాంటి తరహా కాస్ట్యూమ్స్ ఎక్కువగా హాలీవుడ్ అవార్డు వేడుకల్లో కనిపిస్తాయి. కాని మేంమేం తక్కువ కాదు అన్నట్లుగా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి కాస్ట్యూమ్స్ తో మెరుస్తూనే ఉన్నారు.
హిందీలో కేవలం ఒక్క చిత్రంలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగులో ఒకేసారి రెండు సినిమాలో అదీ కాకుండా అక్కినేని హీరోల సరసన నటించే అవకాశం రావడం చాలా అరుదైన విషయంగా చెప్పుకోవాలి. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.