అక్కినేని నాగచైతన్య సరసన `సవ్యసాచి` చిత్రంలో నటించింది నిధి అగర్వాల్. తొలి సినిమాతోనే డ్యాన్సింగ్ డాళ్ అన్న పేరొచ్చింది. ఈ బెంగళూరు బ్యూటీ ఆరంభమే నాగచైతన్య - అఖిల్ ఇద్దరితోనూ అవకాశాలు అందుకుంది. అఖిల్ సరసన నటిస్తున్న `మిస్టర్ మజ్ను` ఈ నెల 25న రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. సింగిల్స్ మైమరిపిస్తున్నాయి. ఇకపోతే అక్కినేని చియాన్ అఖిల్ కి ధీటుగా డ్యాన్సులతో ఈ భామ మైమరిపిస్తుందనడంలో సందేహం లేదు.
నిధి ఓవైపు టాలీవుడ్ లో నటిస్తూనే బాలీవుడ్ లో భారీ ఆఫర్లు అందుకుంటోంది. తాజాగా `ఇక్కా` అనే హిందీ చిత్రంలో నటించే అవకాశం అందుకుంది. ఇక తన తొలి చిత్ర కథానాయకుడు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్ తోనూ స్నేహం మెయింటెయిన్ చేస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ ఫుడ్డింగ్ హ్యాబిట్ కి సంబంధించిన వీడియో ఒకటి లైవ్ లోకి వచ్చింది. నిధి స్వయంగా దీనిని ఇన్ స్టాగ్రమ్ లో అప్ లోడ్ చేసింది. ఓ రెస్టారెంట్ లో ఫుల్ గా లాగిస్తున్న వీడియో ఇది. నిధి మాంచి ఫిష్ ఫ్రై తింటూనే - కేక్ లు ఆరాంగా లాగించేస్తోంది.
ఒక్క మీల్ తో అరకేజీ బరువు పెరిగేంత టేస్టీ ఫుడ్ వండావ్! అంటూ చెఫ్ ని పొగిడేస్తూ కామెంట్ ని పోస్ట్ చేసింది. గోవా లో ఈ రెస్టారెంట్ ఉందని నిధి చెప్పిన దానిని బట్టి అర్థమైంది. గోవా పార్ట్ 2 కూడా చేయాల్సి ఉంది అంటూ వ్యాఖ్యానించింది. మొత్తానికి నచ్చిన చోట నచ్చిన ఫుడ్ తింటూ బాగానే ఎంజాయ్ చేస్తోంది నిధి.
వీడియో కోసం క్లిక్ చేయండి