అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సవ్యసాచి’తో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది బాలీవుడ్ భామ నిధి అగర్వాల్. దీని తర్వాత ఆమె అఖిల్ సరసన కూడా నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈమె లుక్స్ అవీ చూస్తుంటే తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే నిధి ఫిలిం కెరీర్ మాంచి ఊపుమీద కనిపిస్తున్న సమయంలో ఆమె ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉందంటూ వచ్చిన పుకార్లు ఆసక్తి రేకెత్తించాయి. భారత యువ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ తో కలిసి ముంబయిలోని ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ కెమెరాలకు చిక్కింది నిధి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఏమీ లేకుండా వాళ్లిద్దరూ ఇలా ఎందుకు కలుస్తారంటూ డిస్కషన్లు నడిచాయి.
ఐతే ఈ రూమర్లపై నిధితో పాటు రాహుల్ కూడా స్పందించారు. తమ మధ్య ఏమీ లేదని స్పష్టం చేశారు. తామిద్దరం బెంగళూరుకు చెందిన వాళ్లమని.. తాను సినిమాల్లోకి రాకముందు.. రాహుల్ అంతర్జాతీయ క్రికెటర్ కాకముందే స్నేహితులమని నిధి చెప్పింది. ఒకే నగరం నుంచి వచ్చాం.. కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.. కాబట్టి అందరం డిన్నర్ చేశాం అందులో తప్పేముంది.. ఆ మాత్రానికే లింకులు పెట్టేస్తారా అని నిధి ప్రశ్నించింది. మరోవైపు రాహుల్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఎవరినైనా ప్రేమిస్తే తప్పకుండా అందరితో పంచుకుంటానని.. దాచనని చెప్పాడు. నిధి తనకు మంచి ఫ్రెండ్ అన్నాడు. ఆ రోజు డిన్నర్లో బెంగళూరుకే చెందిన ఇంకో ముగ్గురు నలుగురు స్నేహితులు కూడా ఉన్నారని.. కానీ తమ ఇద్దరికే ముడిపెట్ట వార్తలు రాయడం అన్యాయమని అన్నాడు. ఒక అమ్మాయి.. అబ్బాయి కలిసి స్నేహితులుగా ఉండలేరా అని అతను ప్రశ్నించాడు.