ఫోటో స్టొరీ: డెనిమ్ షర్ట్.. డ్యామ్ సెక్సీ

Update: 2019-05-30 01:30 GMT
బెంగుళూరు భామ నిధి అగర్వాల్ బాలీవుడ్ ఫిలిం 'మున్నా మైఖేల్' తో హీరోయిన్ గా పరిచయం అయింది.  తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన 'సవ్యసాచి'.. 'Mr.మజ్ను' సినిమాలు చేసింది. ప్రస్తుతం రామ్ సినిమా 'ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తోంది.  హిందీలో 'ఇక్కా'.. 'మాస్క్' అనే సినిమాలకు సైన్ చేసింది. త్వరలో ఈ సినిమాల షూటింగ్ ప్రారంభం అవుతుందట. ఇది సినిమాల సంగతి.. మరి సోషల్ మీడియా సంగతేంటి? ఏముంటుంది.. హాటు ఫోటోలతో రచ్చ చేసి వదిలిపెడుతుంది.

నెటిజనులు మరో సారి నిధి ఫోటోల దెబ్బకు సుర్రు సుమ్మైపోయారు. ఎందుకంటే తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "నువ్వు క్యూట్ గా ఉన్నావని ఆయన చెప్పినప్పుడు" అంటూ నిధి క్యాప్షన్ ఇచ్చింది.  మరి ఆయన ఎవరో.. ఎందుకు చెప్పాడో వివరాలు వెల్లడించలేదు. ఈ ఫోటోలు ఒక డెనిమ్ షర్టు ను వేసుకొని స్టైల్ గా పోజిచ్చింది.  షర్టు కాలర్ ను పంటితో కొరుకుతున్నట్టుగా ఉంది. హెయిర్ స్టైలింగ్ అందంగా ఉంది. ఈ ఫోటోలో అందాల ప్రదర్శన చేయలేదు కానీ ఎక్స్ ప్రెషన్ మాత్రం హాటుగా ఉంది.  నిధి కళ్ళు ఏదో తెలియని ఆకర్షణ ఉంది.

ఈ ఫోటోకు చాలా కామెంట్లే వచ్చాయి.  ఒకరు "క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్" అన్నారు. మరొకరు "డ్రెస్ నార్మల్.. ఎక్స్ ప్రెషన్ హాట్" అన్నారు. ఇంకొకరు "డెనిమ్ షర్ట్.. డ్యామ్ సెక్సీ" అన్నారు.  అయితే ఒక నెటిజనుడు మాత్రం "అది కేఎల్ రాహుల్  షర్టులా ఉందే" అనే అనుమానం వ్యక్తం చేశాడు.  కొంపదీసి నిధిని క్యూట్ గా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చింది క్రికెటర్ రాహులేనా..?


Tags:    

Similar News