నా ప‌ప్పీని ప‌ట్టిస్తే ల‌క్ష‌ రివార్డ్ ఇస్తాన‌న్న నిధి

Update: 2021-05-13 10:30 GMT
``నా కుక్క‌ను ప‌ట్టిస్తే ల‌క్ష రూపాయ‌లు రివార్డు ..త్వ‌రప‌డండి..ఆల‌సించిన ఆశాభంగం.. అవ‌కాశం మీకే రావొచ్చు`` అన్నట్టుగా ఉందీ ప్ర‌క‌ట‌న‌. బెంగ‌ళూరు సోయగం నిధి అగ‌ర్వాల్ తీవ్ర క‌ల‌త‌లో ఉంది. ``నా పెట్ తప్పి పోయింది. మీరేమైనా చూసారా?  దాని పేరు  కోకో.. వ‌య‌సు ఎనిమిదేళ్లు.. కోకో గుండె సంబంధిత వ్యాధితో కూడా బాధ‌ప‌డుతుంది. అది అంద‌రితో చాలా స‌ర‌దాగా..ప్రెండ్లీగా ఉంటుంది. కానీ ఇప్పుడ‌ది నాతో లేదు.. మిస్ అయింది`` అంటూ వాపోయింది. ప‌ట్టి త‌న ఇంటికి తెచ్చిన వారికి ల‌క్ష  న‌గ‌దు ఇస్తాన‌ని నిధి ఆఫ‌ర్ ఇచ్చింది.

మ‌రి ఆ ల‌క్ష పట్టేసే ఛాన్స్ ఎవ‌రిని వ‌రిస్తుందో కానీ.. ప్ర‌స్తుతం నిధి పోస్ట్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. త‌న ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసినా.. అనుచ‌రులు ఏకంగా త‌మ‌ ప్రోఫైల్ పిక్ గా మార్చుకుని ప్ర‌చారం చేస్తున్నారు. కాబ‌ట్టి కోకో దొరికే ఛాన్స్ ఉంద‌నే భావిద్దాం.

ప్ర‌స్తుతం నిధి అగ‌ర్వాల్  టాలీవుడ్ స‌హా కోలీవుడ్ లోనూ న‌టిస్తోంది.  త‌మిళ్ లో రెండు సినిమాలు.. తెలుగులో మ‌రో రెండు చేస్తోంది. శ్రీరామ్ ఆదిత్య‌.. క్రిష్ లాంటి ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తోంది. ప‌వ‌న్ న‌టిస్తున్న `హ‌రి హ‌ర వీర మ‌ల్లు` లో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంద‌న్న టాక్ ఉంది.
Tags:    

Similar News