ముంబై బ్యూటీ నిధి అగర్వాల్ తెలుసు కదా? బెంగుళూరు భామే కానీ పుట్టింది మాత్రం హైదరాబాద్ లోనే. నాగచైతన్య సినిమా 'సవ్యసాచి' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అఖిల్ తో 'Mr. మజ్ను' కూడా నటించింది. అదేంటో గానీ రెండు సినిమాలు ఈ భామకు పెద్దగా లక్కును తీసుకురాలేకపోయాయి. అయితేనేం.. ఛాన్స్ లకు మాత్రం కొదవలేదు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ - రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇస్మార్ట్ శంకర్' లో హీరోయిన్ గా నటిస్తోంది.
సినిమాల సంగతి పక్కన పెడితే ఈ భామ సోషల్ మీడియాకు రామగుండం వేడిని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఈ భామ నిన్న వారణాసి లో ఉంది. మరి ఏదో సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వెళ్ళిందేమో కానీ అక్కడ నుంచి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇక ఈరోజు కాసేపటి క్రితం మరో ఫోటో పోస్ట్ చేసింది. చూస్తుంటే ఇది మామూలు ఫోటో లాగా లేదు.. సెల్ఫి లాగా ఉంది. మరి వారాణసి నుంచే పోస్ట్ చేసిందో లేక భాగ్యనగరానికి తిరిగి వచ్చిందో తెలీదు కానీ ఫోటో మాత్రం కెవ్వు కేక.
బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ టీ- షర్ట్ వేసుకున్న ఈ భామ ఒక వైట్ కర్చీఫ్ ను మొహానికి కట్టుకుంది. ఈ వాలకం చూస్తే ఎవరైనా డబ్బింగ్ సినిమాల టైటిల్ 'ముసుగు వీరుడు' లాగా 'ముసుగు నారి' లాంటి టైటిల్ ఆమెకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ 'బీట్ ది హీట్'. కర్చీఫ్ కట్టుకుంటే ఆమెకు హీట్ తగ్గుతుంది. మరి నిధి పెంచిన హీట్ ను తగ్గించుకోవడడానికి అమాయకపు మగ నెటిజనులు ఏం చేయాలి? ఈ ఫోటోలో మొత్తం నాలుగు హైలైట్స్ ఉన్నాయి. మొదటి హైలైట్ నిధి కళ్ళు... రెండోది అందంగా ఉన్న ఆమె హెయిర్... మూడోది మాత్రం నిగ నిగ మెరిసిపోతున్న ఆమె మేని రంగు.. మరి నాలుగోది? ఆశ దోశ అప్పడం మాడిపోయిన మసాలా వడ.. మరీ స్పూన్ ఫీడింగ్ అయిపోయింది.. మీరే కనుక్కోండి..!