అశేష సంఖ్యలో అభిమానులున్న హీరోల కూతుళ్ళకు సినిమాల పరంగా చాలా పరిమితులుంటాయి. తోచిన నచ్చిన కథలను చేయలేరు. గ్లామర్ షోకు అసలే అవకాశం ఉండదు. పెర్ఫార్మన్స్ మీదే ఆధారపడాలి. నార్త్ లో ఇలాంటి పోకడ ఉండదు కాని సౌత్ లో మాత్రం వీటికి కట్టుబడి ఉండక తప్పదు. అందుకే మెగా డాటర్ నాగబాబు తనయ నీహారిక సక్సెస్ కోసం ఎదురు చూపులు ఇంకా కొనసాగించాల్సి వస్తోంది.
ఈ ఏడాది చేసిన హ్యాపీ వెడ్డింగ్ డిజాస్టర్ గా నిలవడంతో పాటు అంతకు ముందు తమిళ్ లో విజయ్ సేతుపతితో చేసిన ఫాంటసీ మూవీ కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది. అందుకే కొంత గ్యాప్ తీసుకున్న నీహారిక ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగా స్నేహితులతో కలిసి వియత్నాం బీచ్ లో గడుపుతున్న నీహారిక అక్కడ బీచ్ ఒడ్డులో ఇసుక పాదాలు వేసుకుంటూ నడుస్తున్న పిక్ ఒకటి ఇన్స్ టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.
మొహం చూపించకుండా కేవలం వెనుక నుంచి మాత్రమే కనిపించేలా ఎంత ఆస్వాదించి నడుస్తోందో చెప్పకనే చెప్పింది. త్వరలో సీనియర్ హీరొయిన్ శ్రేయ శరన్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్న నీహారిక అది తనకు పెద్ద బ్రేక్ అవుతుందని ఆశిస్తోంది. దీనికి ఏ లిట్టిల్ బర్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. వెబ్ సిరీస్ లలో సక్సెస్ అయినా సినిమాల్లో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న నీహారికకు అది ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాలి