స్వీయ నిర్భంధనం (సెల్ఫ్ క్వారంటైన్) ఒక్కొక్కరికి ఒక్కోలా కలిసొస్తోంది. సెలబ్రిటీలకు ఇదో పెద్ద ఆటవిడుపులా మారింది. కొందరు కథానాయికలు మేకప్ పై ప్రయోగాలు చేస్తున్నారు. ముఖానికి అద్దే రంగుల గురించి కొందరు లెస్సన్స్ చెబుతుంటే.. హెయిర్ స్టైల్ పైనా .. కాస్ట్యూమ్స్ పై నా ప్రయోగాలు ఎలా చేయాలి? అనేది కొందరు ఫోటోలు వీడియోల రూపంలో సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఇకపోతే మెజారిటీ పార్ట్ సెలబ్రిటీలు నిరంతర ఫోటోషూట్లతో అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నారు.
ఇతరుల కంటే తానేమీ డిఫరెంట్ కాదని ప్రూవ్ చేస్తోంది మెగాప్రిన్సెస్ నిహారిక. నిన్ననే పెదనాన్న చిరంజీవి తన జూబ్లీహిల్స్ ఇంటిని రూఫ్ టాప్ పై నుంచి విజువలైజ్ చేసి మెగా ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఇప్పుడు నిహారిక కొణిదెల పెదనాన్న బాటలోనే తనదైన శైలి సృజనాత్మకతను చూపిస్తోంది. తాజాగా నిహారిక షేర్ చేసిన బెడ్ టైమ్ ఫోటోలో క్రియేటివిటీ మైమరిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఫోటో యువతరంలో కి జెట్ స్పీడ్ గా దూసుకెళుతోంది.
ఖాళీ సమయాన్ని ఇదిగో ఇలా లేజీగా క్రేజీగా గడిపేస్తాను! అనే థీమ్ ని ఎలివేట్ చేస్తూ షూట్ చేసిన ఈ ఫోటోలో నిహారిక ఎంతో ఒద్దికైన లుక్ లో కనిపించింది. మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యేలా మరీ అనవసర ఎక్స్ పోజింగులకు వెళ్లకుండా ఎంతో బ్యాలెన్సింగ్ గా తనలోని మరో కోణాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించి శహభాష్ అనిపిస్తోంది. బటన్స్ తో డిజైన్ చేసిన సింపుల్ టాప్.. చినుగుల జీన్స్.. ధరించింది. అలా లేజీగా బెడ్ పై వాలిపోయింది నిహారిక ఓ చేత్తో కెమెరాని ఇలా నుదుటికి అద్దుకుని చిలిపిగా నవ్వేస్తోంది. దీనిని ప్యారలల్ యాంగిల్ లో ఫ్లాష్ మెరిపించిన తీరు సూపర్భ్.
అన్నట్టు నిహారిక ఇటీవల ఎందుకనో సినిమాలు చేయడం లేదు. సైరా - నరసింహారెడ్డి చిత్రంలో ఇలా మెరిసి అలా వెల్లిపోయే గిరిజన బిజిలీగా కనిపించింది. సోలో సినిమాలేవీ ఆశించినంత విజయం సాధించలేదు కాబట్టి ప్రస్తుతానికి పెద్ద తెర నటనకు బ్రేక్ ఇచ్చేసింది. ఇక సొంత బ్యానర్ లో వెబ్ సిరీస్ లపై నీహారిక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. `మ్యాడ్ హౌస్` అనే వెబ్ సిరీస్ సహా `ముద్ద పప్పు ఆవకాయ్` వెబ్ సిరీస్ తో తిరిగి మెగా ప్రిన్సెస్ రీబూట్ కానుందని ఇటీవల ప్రచారమైంది. మరి వాటికి సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది.