సినీ కుటుంబాల నుంచి హీరోలు వస్తుంటారు కానీ.. హీరోయిన్లు అరంగేట్రం చేయడం అరుదు. ఐతే ఈ మధ్య సంప్రదాయాన్ని మారుస్తూ పెద్ద కుటుబాల నుంచి అమ్మాయిలు కూడా సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ కోవలోనే ‘ఒక మనసు’ సినిమాతో మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక తెరంగేట్రం చేసింది. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. నిహారికకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ దెబ్బతో మళ్లీ ఆమె ఇంకో సినిమా చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఎట్టకేలకు ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాలో నటించిన నిహారిక.. దీని ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీని ప్రోమోలు జస్ట్ ఓకే అనిపించాయి. ఐతే యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్ నుంచి ఈ చిత్రం వస్తుండటంతో దీన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
నిహారికతో పాటు ఇందులో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ కు కూడా ఇప్పుడు హిట్టు చాలా అవసరం. అతడి నుంచి ఓ మోస్తరు సినిమా వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. ఇక ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్న లక్ష్మణ్ కార్యకు కూడా ఈ సినిమా కీలకమే. మరి ఇంది జాతకాలు ముడిపడి ఉన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. పెళ్లి విషయంలో ఈ తరం అమ్మాయిలు.. అబ్బాయిల మనస్తత్వాలకు అద్దం పట్టే సినిమాలా కనిపిస్తోంది. మరి యూత్ ఈ చిత్రానికి ఏమాత్రం కనెక్టవుతారన్నదానిపై దీని ఫలితం ఆధారపడి ఉంటుంది. హీరో హీరోయిన్లకు ఎలాంటి ఇమేజ్ లేకపోవడం.. వాళ్ల ట్రాక్ రికార్డు కూడా గొప్పగా లేకపోవడంతో ఈ చిత్రానికి ప్రి రిలీజ్ బజ్ అయితే లేదు. బుకింగ్స్ కూడా పెద్దగా జరగలేదు. కాబట్టి సినిమాకు మంచి టాక్ రావడం చాలా కీలకం. మరి ఏమవుతుందో?