క్లిక్‌ క్లిక్‌ : కాబోయే భర్తతో జిమ్‌ లో నిహారిక

Update: 2020-10-03 10:50 GMT
మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక వివాహ నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో ఇప్పటికే జరిగిన విషయం తెల్సిందే. వీరి వివాహంను వచ్చే ఏడాది ఆరంభంలోనే నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. చైతన్య మరియు నిహారికలు తాజాగా ఒక జిమ్‌ లో వర్కౌట్స్‌ చేసి బయటకు వస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా కనిపించారు. వీరిద్దరు లవ్‌ బడ్స్‌ మాదిరిగా విహరిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీఠలు ఎక్కబోతున్న నేపథ్యంలో వీరు ఎక్కడ కలిసినా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

హీరోయిన్‌ గా సక్సెస్‌ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించిన నిహారిక కమర్షియల్‌ గా సక్సెస్‌ అవ్వలేక పోయింది. నటిగా పర్వాలేదు అనిపించుకున్న నిహారిక మల్టీ ట్యాలెంట్‌ అనే విషయం తెల్సిందే. ఆమె నిర్మాణం.. దర్శకత్వంతో పాటు పోగ్రాం ప్రొడ్యూసింగ్‌ కూడా చేసింది. నిహారిక సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా ఉంటుంది. తాజాగా నిహారిక కపుల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
Tags:    

Similar News