3 రోజుల్లో ప్రపంచ సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది. మనవాళ్లు ఎంత భారీ బడ్జెట్ తో సినిమాలు చేసిన ఎంత అడ్వాన్స్ టెక్నాలజీతో మన ముందుకు వచ్చిన హాలీవుడ్ లో సరికొత్త సాంకేతికతతో సినిమాలు వస్తుంటాయి. అలాంటి వాటిలో జేమ్స్ కామెరూన్ సినిమాలు ఉంటాయి. ఆయన తీయడం లేట్ అవుతుంది కానీ ఆ సినిమాలు మాత్రం ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా రీచ్ అవుతాయి. అవతార్ 2 సినిమా కూడా ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు. శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇండియన్ మార్కెట్ పై కూడా అవతార్ 2 ప్రభావం ఓ రేంజ్ లో ఉండబోతుందని సినిమాకు వస్తున్న బుకింగ్స్ చూసి చెప్పొచ్చు.
అవతార్ 2 సినిమాతో అసలైతే పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అవతార్ 2 తో వస్తే మాత్రం పుష్ప రాజ్ లెక్క వేరేలా ఉండేది కానీ పుష్ప 2 ప్లేస్ లో ఇప్పుడు నిఖిల్ 18 పేజెస్ ట్రైలర్ వస్తుందని తెలుస్తుంది. అవతార్ 2 ఆడుతున్న ఇండియన్ స్క్రీన్స్ లో ఆ సినిమాతో పాటుగా 18 పేజెస్ ట్రైలర్ యాడ్ చేస్తున్నారట. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన ఈ సినిమా బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తుంది. కుమారి 21f ఫేమ్ సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన 18 పేజెస్ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు.
కార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ 18 పేజెస్ సినిమాతో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. కార్తికేయ 2 నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. అందుకే 18 పేజెస్ సినిమాను తెలుగుతో పాటుగా హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా డిసెంబర్ 23న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ రాసిన ఈ కథలో చాలా ట్విస్ట్ లు ఉంటాయని తప్పకుండా ఆడియన్స్ ని ఈ సినిమా అలరిస్తుందని అంటున్నారు మేకర్స్. నిఖిల్, అనుపమ ఆల్రెడీ కార్తికేయ 2 తో హిట్ అందుకున్నారు. అదే జోడీ ఇప్పుడు 18 పేజెస్ తో వస్తున్నారు.
అవతార్ 2 తో నేషనల్ లెవల్లో నిఖిల్ 18 పేజెస్ మూవీ ట్రైలర్ రాబోతుంది. ఒక సినిమాపై ఆడియన్స్ కి ఆసక్తి కలిగించడంలో ట్రైలర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి 18 పేజెస్ సినిమా ఎందుకు చూడాలి. అసలు సినిమాలో ఏమి ఉంది అన్నది ట్రైలర్ లో చూపించారో లేక ప్రేక్షకులకు హింట్ మాత్రమే ఇచ్చి అసలు కథ సినిమాలో చూడండని ట్రైలర్ డిజైన్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కార్తికేయ 2 తర్వాత నిఖిల్ సినిమాకు ఈ రేంజ్ బూస్టింగ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. సినిమా ఫలితం ఎలా వచ్చినా నిఖిల్ పేరు అవతార్ 2 చూసే ఇండియన్ ఆడియన్స్ అందరికి తెలిసేలా చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.