హిందీలో మళ్ళీ వద్దంటున్న నిఖిల్?

Update: 2022-11-14 04:30 GMT
హీరో నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ సినిమాతో తన బాక్సాఫీస్ రేంజ్ ను ఒక్కసారిగా పెంచేసుకున్నాడు. అసలు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో కొంత లాభాలను అందిస్తుందని అందరు ముందే ఊహించరు. కానీ ఊహించిన విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగతా భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ రావడం విశేషం.

ఫ్యాన్ ఇండియా రేంజ్ లో చిన్న సినిమాలు కూడా మంచి కంటెంట్ తో వస్తే సక్సెస్ అవుతాయి అని ఈ సినిమా నిరూపించింది. అంతేకాకుండా ఆ సమయంలో దేశభక్తి హిందుత్వం కాన్సెప్ట్ సెంటిమెంట్ బాగా వైరల్ అవ్వడం కూడా బాగా కలిసి వచ్చింది. అయితే కార్తికేయ 2 తరువాత ఇప్పుడు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ల దృష్టి మొత్తం కూడా నిఖిల్ పైనే పడింది.

ఇక అతను తదుపరి సినిమాల రిలీజ్ హక్కులను కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక విధంగా కార్తికేయ 2 సినిమా కంటెంట్ తో పాటు రిలీజ్ అయిన టైం కూడా వేరు కాబట్టే ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇక తర్వాత సినిమాలు కూడా అలానే హిందీలో తీసుకువచ్చిన జనాలు థియేటర్లోకి వస్తారు అనేదే చాలా అత్యాశ అవుతుంది.

ఇక 18 పెజెస్ సినిమాను కూడా కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేయాలి అని హిందీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ ఈ సినిమాలో నిర్మిస్తున్న జిఏ 2 పిక్చర్స్ అలాగే సుకుమార్ రైటింగ్స్ కూడా అటువైపుగా పెద్దగా ఫోకస్ చేయలేదు.

ఇక గీత ఆర్ట్స్ కు చాలా సన్నిహితులుగా ఉన్న కొంతమంది బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేస్తూ ఉండడంతో వాళ్లు కూడా ఒప్పుకోవడానికి ఒక చర్చకు వెళ్లారట. నిఖిల్ మాత్రం కార్తికేయ తరహాలో వచ్చిన క్రేజ్ ను మళ్ళీ పోగొట్టుకోకూడదు అని ఆ తర్వాత వచ్చే స్పై సినిమాతో అక్కడి జనాలను ఆకట్టుకోవాలి అని ఆలోచనతో ఉన్నాడు. అందుకే 18 పేజెస్ సినిమా హిందీలో వర్కౌట్ కాదు అని అది చాలా రిస్కుతో కూడుకున్న పని అని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అందుకే నిర్మూతలు టెంప్ట్ అవుతున్న కూడా నిఖిల్ మాత్రం వద్దనే వాదిస్తున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News