నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన కార్తికేయ 2 సినిమా హిందీ వెర్షన్ పాతిక కోట్ల వరకు దక్కించుకుందని టాక్ వినిపిస్తుంది. నిఖిల్ సినిమా ప్రమోషన్ కోసం చాలానే కష్టపడ్డాడు.
విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన తర్వాత ఉత్తర భారతంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని సినిమాకు బజ్ క్రియేట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. కార్తికేయ 2 సినిమా లో నిఖిల్ తో పాటు అనుపమ పరమేశ్వరన్ కి కూడా మంచి స్కోప్ ఉంది. ఇద్దరు కూడా కెరీర్ బెస్ట్ ని ఈ సినిమాతో దక్కించుకున్నారు. దాంతో ఇద్దరి కెరీర్ టర్న్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
కార్తికేయ 2 సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు చందు మొండేటి కి బాలీవుడ్ నుండి మంచి ఆఫర్లు ఎలా అయితే వస్తున్నాయో హీరో నిఖిల్ మరియు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి కూడా వరుసగా పలు భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయట. ఈ సమయంలో వీరిద్దరూ కూడా తమ పారితోషికం తో తమను సంప్రదించిన నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిఖిల్ కార్తికేయ 2 మరియు 18 పేజెస్ సినిమాలకు తీసుకున్న పారితోషికం కు దాదాపుగా డబుల్ పారితోషికాన్ని ఆయన తదుపరి సినిమాకు డిమాండ్ చేస్తున్నాడట.
అంతే కాకుండా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా తన గత సినిమాల పారితోషికంతో పోల్చితే భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.