ఆవెంజర్స్ ఎండ్ గేమ్ అంత కలెక్ట్ చేస్తుంది - ఇంత కలెక్ట్ చేస్తుంది అంటూ తప్పుడు ఊహలతో చాలా మంది తెలుగు నిర్మాతలు తమ సినిమాల్ని వాయిదాలు వేసుకున్నారు. నిఖిల్ అర్జున్ సురవరం కూడా ఈ ఆవెంజర్స్ టార్గెట్ లిస్టులో ఉంది. నిజానికి మే 1న విడుదల కావాల్సిన అర్జున్ సురవరం చిత్రాన్ని డిస్ట్రీబ్యూటర్ల ఒత్తిడి మేరకు వాయిదా వేశారు. ఆ ముందు వారమే ఆవెంజర్స్ విడుదల అవ్వడం - ఆ ఎఫెక్ట్ మే 1న కూడా ఉండొచ్చనే ఉద్దేశంతో అర్జున్ సురవరం రిలీజ్ ని వాయిదా వేశారు. దీంతో పాటు రెండు మూడు చిన్ని సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.
అయితే ఇప్పుడు నిఖిల్ కి ఉన్న మరో తేదీ మే 17 - అయితే ఈ డేట్ ని ఇప్పటికే అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ ఏబిసిడి కోసం లాక్ చేశారు. ఈ చిత్ర యూనిట్ అల్రేడీ మే 17న వస్తున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేసింది. కానీ ఇదే రోజున నిఖిల్ కూడా వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడని తెలిసింది. దీంతో నిఖిల్ కి శిరీష్ కి పోటీ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు నిఖిల్ మళ్లీ ఓ వారం వెనక్కి వెళ్లీ మే 24 న రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సీత కోసం మే 24ని బ్లాక్ చేశారు. చిత్ర యూనిట్ నుంచి అఫీషయల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. థియేటర్స్ కూడా ఈ డేట్ ప్రకారమే బుక్ అవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ డేట్ లో నిఖిల్ కి పోటీ తప్పేలా లేదు. నిజానికి మే 17న సీతని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈ డేట్ లో అల్లు శిరీష్ సినిమా వస్తుండంటం - మెగా కాంపౌండ్ హీరో అవ్వడం - అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అవ్వడంతో సీత మార్కెట్ కి దెబ్బ పడే అవకాశం ఉందని ముందుగానే ఊహించి వీళ్లు ఓ వారం వెనక్కి జరిగారు. దీంతో ఈ రెండు చిత్రాలకు సోలో రిలీజ్ లు వచ్చాయి - కానీ అనుకోకుండా అర్జున్ సురవరం ఇప్పుడు ఈ రెండు సినిమాలకి టెన్షన్ గా మారింది. థియేటర్స్ దొరికితే మే 17కి ఒక వేల దొరక్కపోతే మే 24కి అర్జున్ సురవరంని విడుదల చేయాలని నిఖిల్ అండ్ టీమ్ డిసైడ్ అవుతున్నారు. మీడియా నేపథ్యంగా ఫేక్ సర్టిఫికెట్స్ మాఫియా కథాంశంగా అర్జున్ సురవరం తెరకెక్కింది. తమిళంలో హిట్ గా నిలిచిన కనిధన్ కి అర్జున్ సురవరం తెలుగు రీమేక్.