తెలుగు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ పై బలమైన కాంక్షతో ఉన్నారు. మన సినిమాలు తెలుగు రాష్ట్రాలను మించి హిందీ బెల్ట్ లో బంపర్ హిట్లు కొట్టేయడం ఆశ్చర్యపరుస్తోంది. బాహుబలి - ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ తో అంతా మారిపోయింది. ఇప్పుడు ఉత్తరాది ప్రజలు వినోదం కోసం దక్షిణాది వైపే చూస్తున్నారు. ఇదే అదనుగా మన హీరోలు ఉత్తరాదినా బంపర్ హిట్లు కొట్టి మార్కెట్ రేంజును పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఇలాంటి సన్నివేశంలో నిఖిల్ తాజా ప్రకటన ఆశ్చర్యపరిచింది. ఈ యంగ్ ట్యాలెంటెడ్ హీరో నటించిన `కార్తికేయ 2` తాజాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ శనివారం నాడు బహు భాషల్లో పాన్-ఇండియా కేటగిరీలో విడుదలైంది. మొదటి షో నుండి కార్తికేయ 2 ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. ఆశ్చర్యకరంగా ఉత్తరాదినా మంచి స్పందన వస్తోంది. పాజిటివ్ రిపోర్ట్స్ వినగానే నార్త్ ఇండియాలోని జనాలు సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. న్యూఢిల్లీ- ముంబై వంటి మెట్రో నగరాల్లోని చాలా థియేటర్లలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. షోల టిక్కెట్ లు వేగంగా నిండిపోతున్నాయి. అయితే బాలీవుడ్ పెద్దలు లాల్ సింగ్ చద్దా - రక్షా బంధన్ చిత్రాలను టాక్ తో సంబంధం లేకుండా ఆడిస్తున్నారు. ఈ సినిమాలకు పూర్తిగా నెగెటివ్ రివ్యూలు ఉన్నా ప్రజాదరణ లేకున్నా ఇప్పటికీ ఇతర సినిమాలకు ఛాయిస్ ఇవ్వలేదు.
ఏది ఏమైనా కానీ నిఖిల్ నటించిన కార్తికేయ 2 కోసం ఉత్తర భారతదేశంలో చాలా తక్కువ షోలు కేటాయించారు. కానీ కార్తికేయ 2 రెస్పాన్స్ చూసిన తర్వాత ప్రజలు షోలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇంతలో నిఖిల్ కూడా సినిమా షోలను పెంచమని మల్టీప్లెక్స్ చెయిన్స్ పీవీఆర్ - ఐనాక్స్ లను అభ్యర్థించాడు. అతడు మాట్లాడుతూ..``కార్తికేయ2 హిందీలో హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. దయచేసి హిందీలో షోలను పెంచమని పీవీఆర్ సినిమాస్.. ఐనాక్స్ మూవీస్ ని అభ్యర్థిస్తున్నాను`` అని నిఖిల్ ట్వీట్ చేశాడు. నిఖిల్ మొర విని షోలు పెంచుతారా లేదా? అన్నది వేచి చూడాలి. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు.