కేశవ సినిమా ఈ నెల 19న విడుదల అవుతుంది. ట్రెయిలర్ చూసినప్పిటి నుండి ఫిల్మ్ ఇండస్ట్రి అంతా ఎలర్ట్ అయిపోయింది. ఎందుకంటే స్వామి రా రా లాంటి ఫన్ థ్రిల్లర్ ఇచ్చిన డైరెక్టర్ సుధీర్ వర్మ మూడో సినిమా ఇది. రెండో సినిమా అంతాగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు మళ్ళీ పూర్తి యంగ్ అండ్ ఫ్రెష్ ఎనర్జటిక్ కథతో ట్రైలర్ లో అల్లాడించేశాడు.
ఈ సినిమాలో హీరో నిఖిల్ కు జోడీగా పెళ్ళిచూపులు ఫేమ్ రీతూ వర్మ నటిస్తోంది.ఇకపోతే మొన్న జరిగిన ఆడియో ఫంక్షన్లో మాట్లాడమని మైక్ ఇస్తే ఆ అమ్మాయి తన సహజ దొరణిలోలో చాలా వినయంగా అందరికీ థాంక్స్ చెప్పి.. నాకు సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నా కొ స్టార్ నిఖిల్ కూడా థాంక్స్ అని చెప్పింది. అయితే ఇదంతా ఆమె ఇంగ్లీషులో చెప్పిందిలే. పక్కనే ఉన్న హీరో నిఖిల్ మధ్యలో మైక్ అందుకుని.. "నువ్వు తెలుగు అమ్మాయివే కదా తెలుగులో మాటలాడవచ్చు కదా” అంటూ పంచ్ ఇచ్చాడు. ఆ మాటకి రీతూకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక కాస్త ఇబ్బంది పడిందనే చెప్పాలి.
నిజానికి బొంబాయ్ నుండి వచ్చిన కాజల్.. చెన్నయ్ బేబి త్రిష్.. ఇక్కడే తిష్టేసుకుని డజన్ల కొద్దీ సినిమాలు చేసినా కూడా.. వారు ఎందుకో తెలుగులో మాట్లాడరు. కాని ఈ మధ్య కాలంలో సమంత.. తమన్నా.. రకుల్ వంటి భామలు తెలుగులో అల్లారుముద్దుగా సంభాషిస్తున్నారు. వీరిని ప్రేరణగా తీసుకుని తెలుగు అమ్మాయిలు కూడా తెలుగులో మాట్లాడితే బెటర్. రీతూ అవ్వడానికి నార్త్ ఇండియన్ అయినా కూడా.. హైదరాబాద్ లో తెలుగు కల్చర్ మధ్యన పుట్టిపెరిగిన సుందరే. తెలుగులో చక్కగా డబ్బింగ్ చెబుతోంది.. స్టేజీ మీద కూడా తెలుగు వాడ్డానికేంటో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/