రేపు థియేటర్లలోకి రానున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీపై.. హీరో నిఖిల్ సహా టీం అంతా కాన్ఫిడెంట్ గా ఉంది. అనుకోకుండా సోలో రిలీజ్ కి ఛాన్స్ దొరికినా సరే.. సంతోషించేసే సందర్భం కాదు. జనాల చేతుల్లో కరెన్సీ ఆడకపోవడం.. సినిమా రంగంపై ఎఫెక్ట్ చూపిస్తున్న రోజులివి. 50 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనేందుకు జనాలు అంతగా సందేహించరు అంటూ ధైర్యం థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు ఈ చిన్నవాడు.
'ఎక్కడికి పోతావు చిన్నవాడాలో నేను బాహుబలి మూవీకి గ్రాఫిక్ డిజైనర్ పాత్రలో కనిపిస్తాను. అయితే.. రాజమౌళి ఈ మూవీలో యాక్ట్ చేయలేదు కానీ.. నేను ఆయనతో మాట్లాడేలా సీన్స్ మాత్రం ఉంటాయి' అని చెబుతున్న నిఖిల్ సినిమా స్టోరీ గుట్టు కూడా విప్పేశాడు. 'వెన్నెల కిషోర్ కి దెయ్యం పడుతుంది.. తనకు ట్రీట్మెంట్ ఇప్పించేందుకు బొర్రాగుహల్లో ఉండే మహిషాసుర మర్దనీ ఆలయానికి వెళ్తాం. అఖ్కడి నుంచి ఏం జరిగిందో చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే.. గ్రిప్పింగ్ సీన్స్ ఉంటాయి' అన్నాడు నిఖిల్.
బాగానే ఉంది. అయితే మొన్న 'మజ్ను' సినిమాలో బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా నాని కనిపిస్తే.. ఇప్పుడు నిఖిల్ అదే సినిమాకు గ్రాఫిక్ డిజైనర్ గా కనిపించడం కాస్త సరప్రైజే. వీళ్ళందరూ బాహుబలిని అలా వాడేస్తున్నారనమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/