ఎక్కువగా లవ్ స్టొరీలు చేసే యువ హీరో సందీప్ కిషన్ కొంచెం రూట్ మార్చి ఈసారి హారర్ థ్రిల్లర్ 'నిను వీడని నీడను నేనే' సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ కిషన్ స్వయంగా నిర్మించాడు. ఆర్య సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్.. మురళి శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది.
టీజర్ ప్రారంభం లోనే మురళి శర్మ "అది 2013 కి అనుకుంటాను.. సైన్సుకు మించి ఆలోచింపజేసిన కేస్ అది" అంటూ సస్పెన్స్ పెంచేలా ఇంట్రో ఇస్తాడు. మరోవైపు హీరోయిన్ ఆర్య సింగ్ "తను నా రిషి కాదు డాక్టర్.. చూడాలంటేనే భయంగా ఉంది" అంటూ సందీప్ కిషన్ గురించి భయంగా చెబుతుంది. ఇంతకీ సందీప్ కిషన్ కు ఏమైంది? ఎందుకు అదోలా ప్రవర్తిస్తున్నాడు? దీనికి సమాధానం టీజర్ చివర్లో సందీప్ ఒక అద్దం దగ్గరకు వెళ్లి నిల్చున్నప్పుడు దొరుకుతుంది. అద్దంలో తన ప్రతిబింబం బదులు వెన్నెల కిషోర్ కనిపిస్తాడు. అంటే సందీప్ కిషన్లో ఉండేది వెన్నెల కిషోర్ భయ్యా ఆత్మ. దీని సంగతి పక్కన పెడితే.. మొన్నెప్పుడో జీవితగారు అన్నట్టు 'అర్జున్ రెడ్డి'.. 'RX100' పుణ్యమా అని.. ' ఈ సినిమాలో కూడా లిప్ లాక్స్ ఉన్నాయి.
ఇక ఈ టీజర్లో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాటోగ్రఫీ కూడా హర్రర్ థీమ్ కు తగ్గట్టుగా ఉంది. దర్శకుడు కార్తిక్ రాజు ఇంట్రెస్టింగ్ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. ఆలస్యం ఎందుకు.. ఒక లుక్కేయండి.
Full View